LOADING...
నికోలస్ పూరన్ దమ్మున్న అటగాడు : గౌతమ్ గంభీర్
నికోలస్ పూరన్

నికోలస్ పూరన్ దమ్మున్న అటగాడు : గౌతమ్ గంభీర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 24, 2022
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

వైస్టిండీస్ అటగాడు నికోలస్ పూరన్ ఐపీఎల్ వేలంలో జాక్ పాట్ కొట్టారు. ఈ ప్లేయర్ కోసం రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటిపడగా.. చివరికి అతడ్ని రూ. 16 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ దమ్మున్న ప్లేయరని లక్నోసూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ అన్నాడు. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడని చెప్పాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున 12 మ్యాచ్‌ల్లో 85 పరుగులు చేసి దారుణంగా విఫలమైన పూరన్‌ను ఐపీఎల్ 2022 వేలంలో రూ.10.75 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజికించుకున్నారు . టీ20 ప్రపంచకప్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన నాలుగో ఆటగాడిగా పూరన్ నిలిచాడు.

నికోలస్ పూరన్

గతం ఎవడికి కావాలి : గౌతమ్ గంభీర్

యాక్షన్ బ్రేక్‌లో డిజిటల్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన గంభీర్.. పూరన్ కోసం రూ.16 కోట్లు ఖర్చు చేయడాన్ని సమర్థించుకున్నాడు. 'గత ఐపీఎల్ సీజన్‌లో పూరన్ ఎలా ఆడాడనేది మేం ఆలోచించడం లేదు. అతని సామర్థ్యంపై ఉన్న నమ్మకంతోనే కొనుగోలు చేశాం. అతను 3-4 మ్యాచ్‌లు గెలిపించే సత్తా అతనికి ఉంది. టాప్-4తో పాటు 6-7 స్థానాల్లో ఆడగలిగే సత్తా ఎంతమంది ఆటగాళ్లకు ఉంది. నికోలస్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు.అతని వయసు 27 ఏళ్లే. ఇక్కడి నుంచి అతని కెరీర్ జోరు అందుకుంటుంది. పూరన్ వికెట్ కీపర్ అయిన మా ఫస్ట్ చాయిన్ కీపర్ క్వింటన్ డికాక్. ఉనాద్కత్, డానియల్ సామ్స్, రొమారియో షెఫర్డ్‌లు బేస్‌ప్రైజ్‌కే దక్కారు'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.