ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచులో నికోలస్ పూరన్ సూపర్ సెంచరీ
వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచులు జింబాబ్వే వేదికగా జరుగుతున్నాయి. హరారే స్పోర్ట్ క్లబ్ మైదానంలో గురువారం వెస్టిండీస్, నేపాల్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ సెంచరీతో జట్టును అదుకున్నాడు. దీంతో అంతర్జాతయ వన్డేల్లో రెండు సెంచరీలు సాధించిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మేయర్స్ (1), చార్లెస్ డకౌట్‌తో పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో వెస్టిండీస్ కెప్టెన్ హోప్, పూరన్ జట్టును అదుకోనే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 216 పరుగులను జోడించారు. ఈ క్రమంలో పూరన్ 94 బంతుల్లో (10 ఫోర్లు, 4 సిక్సర్లు) 115 పరుగులు చేసి చేశాడు.
సెంచరీతో కదం తొక్కిన వెస్టిండీస్ కెప్టెన్
అదే విధంగా కెప్టెన్ షాయ్ హోప్ కూడా సెంచరీతో కదం తొక్కి నేపాల్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 129 బంతుల్లో (10 ఫోర్లు, 3 సిక్సర్లు) 132 పరుగులు చేసి చెలరేగిపోయాడు. నికోలస్ పూరన్, షాయ్ హోప్ ధాటికి వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్‌బన్షి 3 వికెట్లతో రాణించగా.. కరణ్, గుల్షన్, సందీప్, దీపేంద్ర సింగ్ తలా ఓ వికెట్ పడగొట్టారు.