Nicholas Pooran:నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు.. రిజ్వాన్‌ను వెనక్కి నెట్టి..!
వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ శనివారం టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. పాకిస్థాన్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ రికార్డును బద్దలు కొట్టి, ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున బార్బడోస్ రాయల్స్‌పై 15 బంతుల్లో 27 పరుగులు చేసిన పూరన్, 2024లో మొత్తం 2,059 పరుగులు సాధించి ఈ ఘనత అందుకున్నాడు. ఇంతకుముందు 2021లో మహ్మద్ రిజ్వాన్ 2,036 పరుగులు చేసి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2024లో పూరన్ అత్యుత్తమ ఫామ్‌తో టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ దూకుడుగా ఆడుతున్నాడు.
ఓకే ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
ఈ ఏడాదిలో పూరన్ 65 ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీ కూడా లేకుండా 14 హాఫ్ సెంచరీలు సాధించడమే కాకుండా, 160.63 స్ట్రైక్ రేటుతో రాణించాడు. టీ20 క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు 1)నికోలస్ పూరన్ - 65 ఇన్నింగ్స్‌లలో 2,059 పరుగులు (2024) 2)మహ్మద్ రిజ్వాన్ - 45 ఇన్నింగ్స్‌లలో 2,036 పరుగులు (2021) 3)అలెక్స్ హేల్స్ - 61 ఇన్నింగ్స్‌లలో 1,946 పరుగులు (2022) 4)జోస్ బట్లర్ - 55 ఇన్నింగ్స్‌లలో 1,833 పరుగులు (2023) 5)మహ్మద్ రిజ్వాన్ - 44 ఇన్నింగ్స్‌లలో 1,817 పరుగులు (2022)