Page Loader
నిఖత్ జరీన్ గోల్డన్ పంచ్.. రెండోసారి టైటిల్ కైవసం
పసిడి సాధించిన నిఖత్ జరీన్

నిఖత్ జరీన్ గోల్డన్ పంచ్.. రెండోసారి టైటిల్ కైవసం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 26, 2023
09:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్ మరోసారి తన పంచ్‌లతో దుమ్ములేపింది. ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో తిరుగులేని విజయం సాధించి రెండోసారి టైటిల్ ను ముద్దాడింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన 50 కేజీల విభాగం ఫైనల్లో నిఖత్ జరీన్ 5-0 తేడాతో వియత్నాంకు చెందిన ఎన్గుయెన్ తై టామ్ పై విజయం సాధించింది. మెరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ ప్రపంచ టైటిళ్లు సాధించిన రెండో భారతీయ మహిళా బాక్సర్‌గా ఆమె నిలిచింది.

సవీటీ బూరా

బంగారు పతకాన్ని ముద్దాడిన సవీటీ బూరా

భారత బాక్సర్ నిఖత్ ఎటాకింగ్ నోట్‌తోనే బౌట్ ను ప్రారంభించింది. అనంతరం తన ప్రత్యర్థిపై వరుస పంచ్‌లతో విరుచుకుపడింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ నీతూ ఘంఘూస్ తర్వాత సవీటీ బూరా కూడా బంగారు పతకాన్ని గెలిచింది. పైనల్ మ్యాచ్‌లో ఆమె చైనాకు చెందిన వాంగ్ లీను సవిటీ బూరా చిత్తు చేసింది. నీతూ ఘంఘాస్ 48 కిలోల బరువు విభాగంలో స్వర్ణం సాధించింది. నిఖత్‌ జరీన్‌ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్ నిలిచింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెను అభినందిస్తూ నెటిజన్లు ట్విట్స్ చేస్తున్నారు.