ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్.. టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో
ప్రతిష్టాత్మక మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్లో భారత బాక్సర్ల హావా కొనసాగుతోంది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా అమ్మాయిలు అదరగొడుతున్నారు. నిఖత్ జరీన్(50 కేజీలు), నీతూ ఘంఘూస్(48 కేజీలు), లవ్లీనా బొర్గోహై(75 కేజీలు), సవీటా బూరా(81 కేజీలు) ఫైనల్‌కు దూసుకెళ్లారు. టర్కీ ప్రదర్శనను మరోమారు పునరావృతం చేస్తూ తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఢిల్లీలో దడదడలాడిస్తున్నది. వరుస బౌట్లలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ముందుకు సాగుతోంది. నేడు, రేపు ఫైనల్ బౌట్‌లు జరుగనున్నాయి. గురవారం జరిగిన 50 కిలోల సెమీస్ పోరులో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ 5-0తో ఇంగ్రిట్ వాలెన్సియాను ఓడించింది. ఫైనల్స్‌లో ఆమె ఆసియా ఛాంపియన్ వియత్నాకు చెందిన న్గుయెన్ తి టామ్‌తో తలపడనుంది.
ఫైనల్స్‌కి చేరిన నీతూ, లవ్లీనా, సావిటీ బూరా
నీతూ కజకిస్తాన్‌కు చెందిన అలు బల్కిబెకోవాపై 5-2 తేడాతో పోరాడి గెలిచింది. గత ఎడిషన్ క్వార్టర్ ఫైనల్స్‌లో బాల్కిబెకోవా, నీతూపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో మంగోలియాకు చెందిన ఆసియా కాంస్య పతక విజేత లుత్‌సాయిఖాన్ అల్టాంట్‌సెట్‌సెగ్‌తో నీతూ తలపడనుంది. లవ్లీనా 4-1తో లీ క్వియాన్(చైనా)పై విజయం సాధించింది. లోవ్లినా తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్‌తో పోరాడనుంది. మూడుసార్లు ఆసియా పతక విజేత సావీటీ బూరా (81 కేజీలు) ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా-సూ గ్రీన్‌ట్రీని 4-3తో ఓడించి సత్తా చాటింది. ఫైనల్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్, చైనాకు చెందిన వాంగ్ లీనాతో ఢీకొట్టనుంది.