క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన లోవ్లినా బోర్గోహైన్, సాక్షి చౌదరి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో సోమవారం భారత బాక్సర్లు ఫర్వాలేదనిపించారు. సాక్షి చౌదరి (52 కేజీలు), లవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు) క్వార్టర్ ఫైనల్ కి దూసుకెళ్లి సత్తా చాటారు.
లోవ్లినా తన ప్రత్యర్థి అయినా మెక్సికోకు చెందిన వెనెస్సా ఒర్టిజ్‌పై 75 కేజీల విభాగంలో సత్తా చాటింది. పూర్తిగా ఏకపక్షంగా జరిగిన పోటీలో లోవ్లినా విజేతగా గెలుపొందింది.
ఈ ప్రదర్శనతో తాను సంతోషంగా లేనని, ఎందుకంటే తాను మరింత మెరుగ్గా రాణించగలనని, తన తదుపరి బౌట్‌లో ఖచ్చితంగా మెరుగవుతానని లవ్లీనా వెల్లడించింది.
తదుపరి రౌండ్‌లో కాంస్య పతక విజేత అయిన మొజాంబిక్‌కి చెందిన రాడి గ్రామేతో లవ్లినా తలపడనుంది.
సాక్షి చౌదరి
మరో బౌట్‌లో విజయం సాధిస్తే కాంస్య పతకం ఖాయం
2022 ఆసియా ఛాంపియన్‌షిప్‌ల కాంస్య పతక విజేత అయిన కజకిస్థాన్‌కు చెందిన ఝజిరా ఉరక్‌బయేవాపై 52 కేజీల ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో 5-0 తేడాతో సాక్షి గెలుపొందింది. సాక్షి చౌదరి పంచులతో మొదటి రౌండ్‌లో సత్తా చాటింది. రెండో రౌండ్ల కూడా తన ప్రత్యర్థిపై సాక్షి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
కజకిస్థాన్‌కు చెందిన బాక్సర్ ఉరక్‌బయేవాపై గెలుపొందడం సంతోషంగా ఉందని, ఉత్సహంగా వచ్చిన ప్రజలు తనను గెలిపించడానికి ప్రేరిపించానని, దీంతో మరింత శక్తివంతంగా ఆడానని సాక్షి చౌదరి స్పష్టం చేసింది.
మరో బౌట్‌లో విజయం సాధిస్తే సాక్షి, లవ్లీనాకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి