Nitish Kumar Reddy : టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డి
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అతడు మెల్‌బోర్న్ టెస్టులో భారత జట్టును ఫాల్ ఆన్ ప్రమాదం నుంచి బయటపెట్టాడు. ఈ క్రమంలో నితీశ్ తన టెస్టు కెరీర్లో 171 బంతుల్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు తొలినుంచి సుదీర్ఘమైన, స్థిరమైన ఆటతీరు చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, 8వ స్థానంలో వచ్చిన భారత బ్యాటర్‌గా అత్యధిక పరుగులు చేయడం ద్వారా రికార్డు సృష్టించాడు.
హాఫ్ సెంచరీ సాధించిన వాషింగ్టన్ సుందర్
ఈ రికార్డు ముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (87) పేరిట ఉండేది. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా తన అర్ధశతకంతో కీలక పాత్ర పోషించాడు. తొమ్మిదో స్థానంలో వచ్చిన అతడు 146 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది అతడి కెరీర్‌లో నాలుగో హాఫ్ సెంచరీ. నితీశ్‌తో కలిసి 8వ వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. అయితే నాథన్ లైయన్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి 8వ వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.