Loading...
Arjuna awards 2025: ఈసారి ఖేల్‌రత్నకు నో.. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు
ఈసారి ఖేల్‌రత్నకు నో.. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు

Arjuna awards 2025: ఈసారి ఖేల్‌రత్నకు నో.. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2026
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 17 మంది క్రీడాకారులను ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులు వరించాయి. అయితే దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డును ఈసారి ఎవరికీ ప్రకటించలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఖేల్‌రత్న కోసం హాకీ స్టార్ హార్దిక్‌ సింగ్‌ పేరును పరిశీలించింది. అయితే చివరకు హార్దిక్‌ సింగ్‌ ఈ అవార్డు రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ ఏడాది ఖేల్‌రత్నకు ఎవరినీ ఎంపిక చేయలేదు.

వివరాలు

అర్జున అవార్డులు అందుకున్నవారు

అథ్లెటిక్స్‌: తేజస్విన్‌ శంకర్‌, మహమ్మద్‌ అజ్మల్‌ వి, ప్రియాంక గోస్వామి

బ్యాడ్మింటన్‌: ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్‌

బాక్సింగ్‌: నరేందర్‌ బెర్వాల్‌

చెస్‌: విదిత్‌ సంతోష్‌ గుజరాతి, దివ్యా దేశ్‌ముఖ్‌

పారా షూటింగ్‌: ధనుష్‌ శ్రీకాంత్‌

హాకీ: లాల్‌రెమ్సియామి, రాజ్‌కుమార్‌ పాల్‌

కబడ్డీ: సుర్జీత్‌, పూజ

పారా షూటింగ్‌: రుద్రాంశ్‌ ఖండేల్వాల్‌

పారా అథ్లెటిక్స్‌: ఏక్తా భ్యాన్‌

రోయింగ్‌: అరవింద్‌ సింగ్‌

షూటింగ్‌: అఖిల్‌ షియోరాన్

వివరాలు

అర్జున అవార్డు (లైఫ్‌టైమ్‌)

లైఫ్‌టైమ్‌ కేటగిరీలో ఫుట్‌బాల్‌ విభాగానికి చెందిన 'అరుమై నాయగం' కు అర్జున అవార్డు దక్కింది.

ద్రోణాచార్య అవార్డులు క్రీడాకారులను తీర్చిదిద్దిన కోచ్‌లకు అందించే ద్రోణాచార్య అవార్డులకు ముగ్గురిని ఎంపిక చేశారు.

ఛోటే లాల్‌ యాదవ్‌ - బాక్సింగ్‌

పర్వీర్‌ సింగ్‌ - అథ్లెటిక్స్‌

నేహా నందకుమార్‌ చవాన్‌ - షూటింగ్‌

లైఫ్‌టైమ్‌ కేటగిరీలో..

ద్రోణాచార్య అవార్డు లైఫ్‌టైమ్‌ కేటగిరీలో ధర్మేంద్ర సింగ్‌ యాదవ్‌ (బాక్సింగ్‌), వీరేందర్‌ కుమార్‌ (రెజ్లింగ్‌)లను ఎంపిక చేశారు.

ADVERTISEMENT