'థాంక్ గాడ్.. పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు' : కపిల్
నూతన ఏడాది కుటుంబ సభ్యులకు సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న రిషబ్ పంత్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక సూచనలు చేశారు. యాక్సిడెంట్ లో గాయాలతో బయటపడ్డ ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ డెహ్రడూన్ ఆస్పత్రిలో క్రమంగా కోలుకుంటున్నాడు. పంత్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు. క్రికెటర్లు ఎవరూ ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లకూడదని భారత్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేర్కొన్నారు. ఏదిఏమైనా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, గతంలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.
'బైక్ నడిపేందుకు అస్సలు అనుమతి ఇవ్వలేదు' : కపిల్
అద్భుతమైన కార్లు మీ దగ్గర ఉన్నాయి. అవి హై స్పీడ్‌తో దూసుకెళ్తాయి. డ్రైవర్ పెట్టుకొనే స్థోమత ఉంది. అందుకే ఎప్పుడూ ఒంటరిగా డ్రైవింగ్ చేయొద్దు. కొన్ని బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని కపిల్ దేవ్ కీలక సూచనలు చేశారు. నేను భారత్ క్రికెటర్ గా ఎదుగుతున్న సమయంలో బైక్ ప్రమాదానికి గురయ్యాను. ఆ తర్వాత నుంచి నా సోదరుడు నన్ను బండిని ముట్టనీవ్వలేదు.పంత్‌ను సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడేసినందుకు దేవుడికి కృతజ్ఞత చెప్పాల్సిందే'' అని అన్నాడు. పంత్ తన కారులో ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పంత్ కారు పూర్తిగా మంటల్లో కాలిపోగా.. అతడు అదృష్టవశాత్తూ గాయాలతో బయటపడ్డాడు.