ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సిరాజ్‌ను పక్కనపెట్టడంపై సోషల్ మీడియాలో విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు.
వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మేనేజ్‌మెంట్ అతనికి విశ్రాంతి ఇచ్చింది.
బుమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు అవకాశం దక్కింది.అదే సమయంలో,ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు బదులుగా వరుణ్ చక్రవర్తిని మేనేజ్‌మెంట్ స్క్వాడ్‌లోకి చేర్చింది.
ఇక్కడే సిరాజ్(Siraj)అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.ప్రధాన స్క్వాడ్‌లోకి కాకుండా, అతనిని కేవలం నాన్-ట్రావెల్ రిజర్వ్‌గా మాత్రమే ఎంపిక చేశారు.
సీనియర్ పేసర్‌ను పక్కన పెట్టడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడ్డారు.
2022 నుంచి బుమ్రా తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ సిరాజ్.
అంతేకాదు,2023 జనవరిలో వన్డే క్రికెట్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచిన అతడిని ఇలా పక్కన పెట్టడాన్ని అభిమానులు తప్పుపట్టారు.
వివరాలు
క్రికెట్ ప్రేమికుల విమర్శలు:
"బుమ్రా లేడు, షమీ పూర్తిగా ఫామ్‌లో లేడు. ఈ పరిస్థితుల్లో సిరాజ్‌కు బదులుగా హర్షిత్ రాణాను ఎందుకు పరీక్షించాలి? మ్యాచ్ విన్నర్ అయిన సిరాజ్‌కు జట్టులో స్థానం లేకపోవడం దారుణం."
"భారత ప్రధాన కోచ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. అతను కేవలం కేకేఆర్ ప్లేయర్లను మాత్రమే ప్రోత్సహిస్తున్నాడా? సిరాజ్‌ను కాదని హర్షిత్‌ను తీసుకోవడం, యశస్వి స్థానంలో వరుణ్‌ను ఎంపిక చేయడం చూస్తే ఈ ఆరోపణలు నిజమేననిపిస్తున్నాయి. ఇది భారత క్రికెట్‌కు మంచిది కాదు."
"జట్టులో ఐదుగురు స్పిన్నర్లా? ఇది ఎంతవరకు న్యాయం? కనీసం ఒక స్పిన్నర్‌కు బదులుగా సిరాజ్‌ను ఎంపిక చేయాల్సింది. అలాగే, యశస్విని పక్కనపెట్టడం సరికాదు. సుందర్ స్థానంలో యశస్విని తీసుకుంటే జట్టుకు మరింత లాభం ఉండేది."