LOADING...
Virat kohli : 100 శాతం ఫిట్‌నెస్ లేదు.. ఆరోగ్య సమస్యలపై విరాట్ కోహ్లీ ఓపెన్ కామెంట్స్!
100 శాతం ఫిట్‌నెస్ లేదు.. ఆరోగ్య సమస్యలపై విరాట్ కోహ్లీ ఓపెన్ కామెంట్స్!

Virat kohli : 100 శాతం ఫిట్‌నెస్ లేదు.. ఆరోగ్య సమస్యలపై విరాట్ కోహ్లీ ఓపెన్ కామెంట్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ విజయంలో మరోసారి కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ. బుధవారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 49 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శనపై కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే తాను ఇంకా 100 శాతం ఫిట్‌గా లేనని స్పష్టంచేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ, ఆరెంజ్ క్యాప్ అందుకున్న అనంతరం మాట్లాడుతూ తన మోకాలికి గాయం ఉన్నట్లు వెల్లడించాడు.

వివరాలు

ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా

గత మ్యాచ్‌లో కూడా మోకాలి నొప్పితో ఇబ్బంది పడ్డానని, అంతేకాదు గత నాలుగు ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే ఇప్పుడు కొంచెం బాగుంది. కానీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌కు చేరుకోలేదు. మోకాలి నొప్పి ఇంకా ఉంది. అలాగే ఇటీవల అనారోగ్యం కూడా వెంటాడింది. ఇప్పుడు మళ్లీ నా అత్యుత్తమ ఫామ్‌ను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈరోజు మంచి ఆరంభం లభించింది. నా ఇంటెన్సిటీపై సంతోషంగా ఉందని కోహ్లీ పేర్కొన్నాడు. మ్యాచ్‌ను చివరి వరకు ముగించలేకపోవడం పట్ల కొంత నిరాశ వ్యక్తం చేసిన కోహ్లీ, కొన్ని సందర్భాల్లో మ్యాచ్ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.

వివరాలు

తన బ్యాటింగ్ పై సంతృప్తిగా ఉంది

పిచ్ పరిస్థితులపై మాట్లాడిన కోహ్లీ, చిన్నస్వామి స్టేడియంలో సాధారణంగా ఉండే పిచ్‌తో పోలిస్తే ఇది భిన్నంగా ఉందని తెలిపాడు. పిచ్‌పై గడ్డి లేకపోవడం, గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండ కారణంగా వికెట్ పూర్తిగా పొడిగా మారిందని వివరించాడు. దీంతో పిచ్ నెమ్మదిగా మారిందని, ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసినట్లు చెప్పాడు. దీంతో పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల్లోనుంచి లాగేయాలని వ్యూహం రూపొందించామని, అదే విధంగా అమలు చేయగలిగినందుకు ఆనందంగా ఉందని కోహ్లీ పేర్కొన్నాడు. మొత్తంగా తన బ్యాటింగ్‌పై తాను సంతృప్తిగా ఉన్నానని వెల్లడించాడు.

Advertisement