Suresh Raina: మీరంతా కాదు… అయ్యగారే తోపు..రైనా ఊచకోతకు ఇప్పటికీ సాటి లేరు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ చరిత్రలో మే 30కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇదే రోజు 2014లో ముంబైలోని వాంఖడే స్టేడియం ఓ అద్భుతమైన, మరచిపోలేని ఇన్నింగ్స్‌కు వేదికైంది. క్వాలిఫైయర్-2లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన భారీ 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సురేష్ రైనా ఆడిన తుఫాను ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చెరిగిపోని గుర్తుగా నిలిచిపోయింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌కు పునాది వేసింది ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అతను కేవలం 58 బంతుల్లోనే 122 పరుగులు సాధించి తన వింటేజ్ శైలిని మళ్లీ గుర్తు చేశాడు. అతని ఈ దుమ్మురేపే ప్రదర్శనతో పంజాబ్ భారీ స్కోరు నమోదు చేసింది.
వివరాలు
కేవలం 27 బంతుల్లోనే 87 పరుగులు
అయితే, ఆ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రైనా చూపిన దూకుడు అసాధారణం. కేవలం 25 బంతుల్లోనే 87 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం అతని ఆధిపత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. రైనా తన అర్ధశతకాన్ని కేవలం 16 బంతుల్లోనే పూర్తి చేసి, ఆ సమయంలో ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన ఫిఫ్టీగా రికార్డు సృష్టించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరు 100/2గా ఉండగా, అందులో రైనా ఒక్కడే 87 పరుగులు చేయడం విశేషం. అయితే పవర్‌ప్లే ముగిసిన వెంటనే మొదటి బంతికే అతను రన్ అవుట్ కావడం మ్యాచ్ మలుపు తిప్పింది.
వివరాలు
ఆ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం
బ్రెండన్ మెకల్లమ్ పిలుపు మేరకు పరుగు తీయబోయిన రైనాను జార్జ్ బెయిలీ అద్భుతమైన డైరెక్ట్ హిట్‌తో పెవిలియన్‌కు పంపించాడు. ఒకవేళ రైనా ఇంకొన్ని ఓవర్లు క్రీజులో నిలిచివుంటే ఫలితం పూర్తిగా మారిపోయేదని అభిమానులు ఇప్పటికీ చర్చించుకుంటుంటారు. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ 202 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఆ ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటూ రైనా, "నా మనసులో అప్పట్లో ఒక్కటే ఉంది... ఎలాగైనా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాలి, అస్సలు వదలకూడదు అనుకున్నానని చెప్పాడు. కాలం మారినా, ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు నమోదైనా... ఆ రోజు సురేష్ రైనా ఆడిన ఆ అద్భుత ఇన్నింగ్స్‌కు ఉన్న ప్రత్యేకత మాత్రం ఇప్పటికీ చెదరలేదు.