Page Loader
US Open : యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన నోవాక్ జకోవిచ్.. ఆ రికార్డు సమం!
యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన నోవాక్ జకోవిచ్.. ఆ రికార్డు సమం!

US Open : యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన నోవాక్ జకోవిచ్.. ఆ రికార్డు సమం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2023
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

సెర్బియా స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మరో కొత్త చరిత్రను లఖించాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రష్యన్ స్టార్ డానిల్ మెద్వెదేవ్‌ను చిత్తు చేసిన జొకోవిచ్, టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన టెన్నిస్ ప్లేయర్ మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేశాడు. మొత్తం మీద జకోవిచ్ కెరీర్‌లో ఇది 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. 2021లో ఇదే టోర్నీ ఫైనల్లో జకోవిచ్‌ను మెద్వెదేవ్ ఓడించి చరిత్రపుటలకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ ను సాధించిన నోవాక్ జకోవిచ్ మళ్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

Details

మహిళల విభాగంలో కోకో గాఫ్ విజయం

మ్యాచ్ విషయానికొస్తే జకోవిచ్ ప్రత్యర్థికి ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. . మెద్వెదేవ్‌ను 6-3, 7-6 (5), 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి టైటిల్ సాధించాడు. ఈ విజయంతో తాను చిన్నతనంలో కన్న కల ప్రస్తుతం సాకారమైందని జకోవిచ్ మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో ప్లేయర్ కోకో గాఫ్ గాఫ్ కొత్త చరిత్రను సృష్టించింది. ఫైనల్లో అరీనా సబలెంకాను ఓడించి మహిళల సింగిల్స్ టైటిల్ సాధించింది.