ఆస్ట్రేలియాకు రీ ఎంట్రీ.. మొదటి మ్యాచ్‌లోనే జకోవిచ్ అద్భుత విజయం
ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెన్లో నోవాక్ జొకోవిచ్ విజయంతో టోర్నిని ప్రారంభించాడు. కరోనా వ్యాక్సిన్ టీకాను వేసుకోకపోవడంతో గతంలో టోర్నమెంట్స్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్ ఆడటానికి అవకాశం రాలేదు. అయితే యూఎస్ ఓపెన్ టోర్ని నుంచి మాత్రం ఆయనే స్వయంగా తప్పుకున్నాడు. అయితే మంగళవారం అడిలైడ్ ఇంటర్నేషనల్ 1లో తన ప్రత్యర్థిపై 6-3, 6-2 తేడాతో నోవాక్ జకోవిచ్ విజయాన్ని సాధించాడు. ఆస్ట్రేలియాలో తన మొదటి సింగిల్స్ మ్యాచ్‌లో సత్తా చాటాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొనేందుకు మెల్‌బోర్న్ వెళ్లిన జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు రద్దు చేశారు. దీంతో మూడేళ్లు జొకోవిచ్ పై నిషేదాన్ని అమలు చేశారు.
అండగా ఉన్నందుకు ధన్యవాదాలు
డబుల్ బ్రేక్‌తో 4-0తో రెండో సెట్లోనే జకోవిచ్ జోరును పెంచారు. అభిమానులు జొకోవిచ్ అని గట్టిగా నినాదాలు ఇవ్వడంతో జకోవిచ్ తన దైన స్ట్రైల్‌లో తన మొదటి మ్యాచ్‌ను ముగించాడు. 'నేను ఆస్ట్రేలియా తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను అనుకున్న స్థాయిలో నాకు స్వాగతం లభించింది. మీరంతా నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు' అని జకోవిచ్ కోర్టులో చెప్పారు. ఆస్ట్రేలియాలో అత్యధిక విజయాలు సాధించానని, తన మొదటి గ్రాండ్ స్లామ్, తొమ్మిది ఆస్ట్రేలియా ఓపెన్స్ ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. "ఆస్ట్రేలియా అత్యుత్తమ టెన్నిస్ ఆడే ప్రదేశం, నేను ఇక్కడికి రావాలని చూశాను. నేను ఇక్కడ ఉండడం సంతోషంగా ఉందని జకొవిచ్ తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియన్ జోర్డాన్ థాంప్సన్‌ను 6-3 6-4తో ఓడించాడు.