INDvsNZ: రాజ్ కోట్ వన్'డేలో.. ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 47.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయవంతంగా చేధించింది. ఈ మ్యాచ్‌లో డారిల్ మిచెల్ (131*) సెంచరీ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి విల్ యంగ్ 87 పరుగులతో మంచి సహకారం అందించాడు. అలాగే ఫిలిప్స్ 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాన్వే 16, నికోల్స్ 10 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు 1-1తో సమం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ చేసిన ట్వీట్
New Zealand win the 2nd ODI in Rajkot and level the series 1⃣-1⃣
— BCCI (@BCCI) January 14, 2026
Scorecard ▶️ https://t.co/x1fEenI0xl#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/XZioDArcsG