NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / NZ vs PAK: న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్.. మెరిసిన మిచెల్, సౌథీ 
    తదుపరి వార్తా కథనం
    NZ vs PAK: న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్.. మెరిసిన మిచెల్, సౌథీ 
    NZ vs PAK: న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్.. మెరిసిన మిచెల్, సౌథీ

    NZ vs PAK: న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్.. మెరిసిన మిచెల్, సౌథీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 12, 2024
    04:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో శుక్రవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 46 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.

    ఈ విజయంతో కివీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో కీలక ఆధిక్యంలో నిలిచింది.

    తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 226 పరుగుల అత్యధిక స్కోరును సాధించింది.

    డారిల్ మిచెల్ (61; 27 బంతుల్లో)భీకరంగా ఆడాడు. 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ (57; 42 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు.

    అయితే ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ కాన్వే డక్ ఔట్ అయ్యాక, షాహీన్ షా అఫ్రిది వేసిన రెండవ ఓవర్లో ఫిన్ అలెన్ 24 పరుగులు చేశాడు.

    Details 

    ధాటిగా ఆడిన మిచెల్ 

    ఫిన్ అలెన్ (35; 15 బంతుల్లో) దూకుడుతో పాక్‌పై న్యూజిలాండ్ పైచేయి సాధించింది.

    ఫిన్ అలెన్‌ ఔట్ అయ్యాక బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్‌, విలియమ్సన్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.

    మిచెల్ బౌండరీలు, సిక్సర్లతో స్టేడియం ను హోరెత్తించాడు. విలియమ్సన్ 40 బంతుల్లో అర్ధశతకం సాధించి అబ్బాస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

    అనంతరం మిచెల్ మరింత చెలరేగి 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

    ఫిలిప్స్(19; 11 బంతుల్లో)చాప్‌మన్ (26; 11 బంతుల్లో),సౌథి (6*; 2 బంతుల్లో) తలో చేయి వేయడంతో న్యూజిలాండ్ పాక్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

    పాకిస్థాన్ తరఫున షాహీన్ 46 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. అబ్బాస్ అరంగేట్రం మ్యాచ్ లో 34 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.

    Details 

    రెండో టీ20 జనవరి 14 

    బ్యాట్టింగ్ కి దిగిన పాకిస్థాన్ 18 ఓవర్లలో180 పరుగులకు ఆలౌటైంది.బాబర్ అజామ్(57;35 బంతుల్లో) టాప్ స్కోరర్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    న్యూజిలాండ్

    తాజా

    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ

    న్యూజిలాండ్

    ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! స్టార్ బౌలర్ రీఎంట్రీ ఇంగ్లండ్
    NZ Vs UAE:రెండో సారి 5 వికెట్లను తీసిన సౌథీ  క్రీడలు
    NZ Vs UAE: 5 వికెట్లతో విజృంభించిన టీమ్ సౌథీ.. యూఏఈపై న్యూజిలాండ్ ఘన విజయం క్రికెట్
    UAE Vs NZ : టీ20లో చరిత్ర సృష్టించిన యూఏఈ.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025