Loading...
India vs Afghanistan: ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్.. కోహ్లీ-రోహిత్ రీఎంట్రీకి రంగం సిద్ధం!
ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్.. కోహ్లీ-రోహిత్ రీఎంట్రీకి రంగం సిద్ధం!

India vs Afghanistan: ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్.. కోహ్లీ-రోహిత్ రీఎంట్రీకి రంగం సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2026
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు, ఆఫ్ఘనిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. ఒకే ఒక్క టెస్టుతో పాటు మూడు వన్డేలు నిర్వహించనున్నట్లు బీసీసీఐ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 6 నుంచి ఏకైక టెస్టు ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జూన్ 6 నుంచి న్యూ ఛండీఘర్‌లో జరుగుతుంది. టెస్టు అనంతరం వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.

Details

జూన్ 14 నుంచి వన్డే సిరీస్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా:

జూన్ 14న ధర్మశాలలో తొలి వన్డే,

జూన్ 17న లక్నోలో రెండో వన్డే,

జూన్ 20న చెన్నైలో మూడో వన్డే జరుగుతాయి.

ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ 2023 నుంచే వాయిదాలు పడుతూ వస్తోంది. చివరకు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఈ సిరీస్‌ను బీసీసీఐ ఖరారు చేసింది.

టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో భారత జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్ గెలిస్తే మార్చి 8న ఫైనల్ జరుగుతుంది. వరల్డ్ కప్ అనంతరం ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమవుతుంది.

Details

జూలైలో ఇంగ్లండ్ టూర్ 

ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ టెస్టు, వన్డే సిరీస్ నిర్వహించనున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అనంతరం జూలైలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది. ఈ టూర్‌లో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

రోహిత్, విరాట్ రీఎంట్రీపై ఆసక్తి

జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

చాలామంది జూలైలో ఇంగ్లాండ్ టూర్‌ద్వారానే వీరి రీఎంట్రీ ఉంటుందని భావించారు.

అయితే ఆఫ్ఘనిస్తాన్‌తో జూన్‌లో జరిగే వన్డే సిరీస్‌లోనే ఈ ఇద్దరూ మళ్లీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ADVERTISEMENT