అప్గానిస్తాన్ తో వన్డే సిరీస్.. కోహ్లీ రోహిత్‌కు విశ్రాంతి! మ్యాంగ్ వార్ కు నో ఛాన్స్!
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముగిసిన వెంటనే టీమిండియా జట్టు స్వదేశంలో ఆప్ఘనిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ను ఆడనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. హార్ధిక్ పాండ్యా సారథ్యంలో యువ ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇఫ్పటికే టీమిండియా సెలెక్టర్లు ద్వితీయ శ్రేణి జట్టు ఎంపిక కోసం కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లో రాణించిన యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఆకాశ్ మధ్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్లతో జట్టులో ఎంపిక చేయనున్నట్లు పీటీఐ స్పష్టం చేసింది.
భారత ద్వితీయ శ్రేణి జట్టు అంచనా
ఆప్ఘన్ తో సిరీస్ కు సంబంధించి షెడ్యూల్ ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఐపీఎల్ పూర్తియైన వెంటనే ఈ సిరీస్ గురించి బీసీసీఐ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్ జూన్ మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఈ సిరీస్ ముగిసిన భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇక ఆప్గానిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరంగా ఉంటున్నాడని వార్తలు రావడంతో నవీన్ తో మ్యాంగోవార్ మిస్ అవుతామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆడే భారత జట్టు :(అంచనా) గైక్వాడ్, జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, త్రిపాఠి, తిలక్ వర్మ, వధేరా, జితేశ్ శర్మ, చాహల్, కుల్దీప్ యాదవ్, మధ్వాల్, అర్ష్‌దీప్, ఆవేశ్ ఖాన్, మోహ్‌సిన్ ఖాన్, విజయ్ శంకర్