LOADING...
Arshdeep Singh: అయ్యో అర్ష్‌దీప్.. ఆరు నెలలుగా ఒక్క వికెట్ కోసం ఎదురుచూపులు!
అయ్యో అర్ష్‌దీప్.. ఆరు నెలలుగా ఒక్క వికెట్ కోసం ఎదురుచూపులు!

Arshdeep Singh: అయ్యో అర్ష్‌దీప్.. ఆరు నెలలుగా ఒక్క వికెట్ కోసం ఎదురుచూపులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2025
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించేందుకు కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా (Arshdeep Singh 100 T20 wickets) చరిత్ర సృష్టించేందుకు అతడు ఒక్క వికెట్ దూరంలోనే ఉన్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025లోనే ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే అర్ష్‌దీప్ ఈ అరుదైన రికార్డు తన పేరుకి చేరదీయవచ్చు.

Details

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు

అసలు విషయానికి వస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో అర్ష్‌దీప్ ఈ రికార్డును అందుకోవాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్‌కి తుది జట్టులో చోటు దక్కకపోవడంతో అతడు అప్పట్లో వెనుకంజ వేయాల్సి వచ్చింది. దీంతో ఈ రికార్డు కోసం ఇన్నాళ్లుగా ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ కొనసాగుతున్నాడు.

Details

భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు

అర్ష్‌దీప్ సింగ్ - 63 మ్యాచుల్లో 99 వికెట్లు యుజ్వేంద్ర చాహల్ - 80 మ్యాచుల్లో 96 వికెట్లు హార్దిక్ పాండ్యా - 114 మ్యాచుల్లో 94 వికెట్లు భువనేశ్వర్ కుమార్ - 87 మ్యాచుల్లో 90 వికెట్లు జస్‌ప్రీత్ బుమ్రా - 70 మ్యాచుల్లో 89 వికెట్లు

Details

ఆసియా కప్ 2025లో భారత్ షెడ్యూల్ ఇదే

సెప్టెంబర్ 9 : టోర్నీ ప్రారంభం సెప్టెంబర్ 10 : భారత్ తొలి మ్యాచ్ యూఏఈతో సెప్టెంబర్ 14 : భారత్ vs పాకిస్తాన్ - క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరు సెప్టెంబర్ 19 : భారత్ vs ఒమన్ - లీగ్ దశ చివరి మ్యాచ్ ఈ క్రమంలో సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ తన 100వ వికెట్ సాధించి అరుదైన రికార్డు బుక్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.