తదుపరి వార్తా కథనం

ఇన్స్టాగ్రామ్ వేదికగా కుమార్తె ఫొటోను షేర్ చేసిన యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 26, 2023
09:27 am
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్,అతని భార్య హాజెల్ కీచ్ తమ రెండవ బిడ్డకు స్వాగతం పలికారు.
యవరాజ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పాపా,కుమారుడు,భార్య ఉన్న ఓ పిక్ ను పోస్టు చేశాడు.
పోస్ట్‌తో పాటు, "మా చిన్న యువరాణి ఆరాకు స్వాగతం. ఎన్నో నిద్రలేని రాత్రులు ఇప్పుడు చాలా సంతోషకరంగా మారాయి" అని క్యాప్షన్‌లో రాశారు.
యువరాజ్ సింగ్ పోస్ట్‌ను పెట్టిన వెంటనే, అభిమానులు, సెలబ్రిటీలు అభినందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది.
సానియా మీర్జా, హర్భజన్ సింగ్ రెడ్ హార్ట్ ఎమోజీలతో యువీకి అభినందనలు తెలిపారు.