IPL auction : రెండో రోజు ఐపీఎల్ వేలం.. భారీ ధర పలికిన మార్కో జాన్సన్
ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల వేలం రెండో రోజైన సోమవారం మరింత ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇవాళ వేలంలో దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ అత్యధిక ధర పలికాడు. పంజాబ్ కింగ్స్ అతన్ని రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. భారీ ధరకు అమ్ముడైన ప్లేయర్లు 1)భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.5.75 కోట్లకు దక్కించుకుంది. 2) నితీష్ రానా రాజస్థాన్ రాయల్స్‌కు రూ.4.20 కోట్లకు చేరాడు. 3)గుజరాత్ టైటాన్స్ వాషింగ్టన్ సుందర్‌ను రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. 4) సామ్ కరన్‌ను చెన్నై రూ.2.40 కోట్లకు తీసుకుంది. 5) ఫాఫ్ డూప్లెసిస్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ.2 కోట్లకు చేరాడు. 6) రోవ్‌మన్ పావెల్‌ను కేకేఆర్ రూ.1.50 కోట్లకు దక్కించుకుంది.
అన్‌సోల్డ్ ప్లేయర్లు వీరే
కేన్ విలియమ్సన్ ని ఈ సారి వేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. భారత క్రికెటర్లు అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు కూడా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.