LOADING...
Virat kohli: 18 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్‌లో విరాట్ కోహ్లీ.. 
18 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్‌లో విరాట్ కోహ్లీ..

Virat kohli: 18 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్‌లో విరాట్ కోహ్లీ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2025
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో అత్యధిక అభిమానులను ఆకర్షించే ఫ్రాంఛైజీలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ఒకటి. ఆర్సీబీకి విస్తృతమైన అభిమానగణం ఉండటానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ ప్రారంభం నుంచి రికార్డు మీద రికార్డు నమోదు చేసిన కోహ్లీ,ఈ జట్టులో చేరి నేటికి 18 ఏళ్లు పూర్తయింది. 2008 అండర్-19 ప్రపంచ కప్‌లో కోహ్లీ 235 పరుగులు చేసి భారత జట్టును టైటిల్ గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. దీని తర్వాత అతనిని కొనుగోలు చేసేందుకు అనేక ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపాయి. అయితే,దిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) లోకల్ ప్లేయర్ అయిన కోహ్లీని ఎంపిక చేయకుండా, దిల్లీకి చెందిన బౌలర్ ప్రదీప్ సంగ్వాన్‌ను తీసుకుంది.

వివరాలు 

252 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు, 55 అర్థశతకాలు

అప్పటికే జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్ లాంటి బ్యాట్స్‌మెన్ ఉండటంతో మరో బ్యాటర్ అవసరం లేదని ఢిల్లీ డేర్‌డెవిల్స్ భావించింది. ఫలితంగా, ఆర్సీబీ కోహ్లీని తమ జట్టులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విరాట్ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అన్ని సీజన్లలో ఒకే ఫ్రాంఛైజీకి ఆడిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ ప్రత్యేకమైన రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా కోహ్లీ ఆర్సీబీకి టైటిల్ అందించలేకపోయినా,బ్యాటర్‌గా మాత్రం అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పటి వరకు 252 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు, 55 అర్థశతకాలు సాధించి మొత్తం 8,004 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

వివరాలు 

మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025

2013-2021 మధ్య ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్, 2016 సీజన్‌లో కేవలం 16 మ్యాచ్‌ల్లోనే 973 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 2022 సీజన్‌కు ముందు కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగి, ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్ 2025 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.