LOADING...
Imran Khan: ఇలాగైతేనే భారత్ పై గెలుస్తాం.. పాక్ జట్టుపై ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు
ఇలాగైతేనే భారత్ పై గెలుస్తాం.. పాక్ జట్టుపై ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు

Imran Khan: ఇలాగైతేనే భారత్ పై గెలుస్తాం.. పాక్ జట్టుపై ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌లో వరుసగా రెండోసారి భారత్‌ చేతిలో పరాజయం పాలైన పాకిస్తాన్‌ జట్టుపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) ఘాటుగా స్పందించారు. ఈ పరాజయం నేపథ్యంలో తన జట్టును ఆయన తీవ్రంగా విమర్శించారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసీం మునీర్‌ (Asim Munir), పీసీబీ ఛైర్మన్‌ నఖ్వీ ఓపెనర్లుగా ఆడితే, అంపైర్లు అందరూ మనవాళ్లే అయితే గెలుపు సాధ్యమవుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.