
Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి మెరుపుదాడికి పాల్పడింది.
తొమ్మిది ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకొని సమర్థవంతంగా దాడులు జరిపింది.
ఈ చర్య దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతోంది.
ఇప్పటికే రాజకీయ, సామాజిక వర్గాల్లో స్పందనలు వెల్లువెత్తుతున్న వేళ, క్రికెట్ ప్రపంచం కూడా స్పందిస్తోంది.
మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెలిబుచ్చారు.
వివరాలు
సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు షేర్ చేసుకున్న క్రికెటర్లు
వీరేంద్ర సెహ్వాగ్: ''ధర్మో రక్షతి రక్షితః.. జైహింద్ భారత సేన'' అంటూ అభినందనలు తెలిపారు.
వరుణ్ చక్రవర్తి, సురేశ్ రైనా: ఈ ఆర్మీ దాడిని ''ఆపరేషన్ సిందూర్''గా పేర్కొన్నారు.
ఆకాశ్ చోప్రా: ''ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తాం. జై హింద్'' అంటూ భారత సైన్యానికి మద్దతు ప్రకటించారు.
గౌతమ్ గంభీర్: ''జై హింద్''
ప్రజ్ఞాన్ ఓజా, వెంకటేశ్ ప్రసాద్, ఆర్పీ సింగ్: ''జై హింద్. భారత్ మాతాకీ జై''
చేతన్ శర్మ: ''భద్రత విషయంలో భారత్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. ఇప్పుడు ఇచ్చినది సమాధానం కాదు... సందేశం''
సామ్ బిల్లింగ్స్ (ఇంగ్లండ్ క్రికెటర్): ''భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు త్వరగా స్థిరపడాలని ఆకాంక్షిస్తున్నా''