తదుపరి వార్తా కథనం

అదరగొట్టిన ఆర్సీబీ బౌలర్లు; 18పరుగుల తేడాతో లక్నోపై విజయం
వ్రాసిన వారు
Stalin
May 01, 2023
11:51 pm
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ల ధాటికి లక్నో సూపర్‌జెయింట్స్(ఎల్ఎస్‌జే) బ్యాటర్లు ఢీలా పడ్డారు. 18పరుగుల తేడాతో లక్నోపై ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 126 పరుగులు చేసింది. దీంతో ఆర్‌సీబీ నిర్దేశించిన 127 పరుగలు స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో ఎల్ఎస్‌జి జట్టు విఫలమైంది. తమ స్కోరును కాపాడుకోవడంలో ఆర్‍సీబీ బౌలర్లు సఫలీకృతమయ్యారు.
లక్నో బ్యాటర్లలో క్రిష్ణప్ప ఒక్కడే 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లందరూ చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు.
ముఖ్యంగా స్పిన్నర్లు ధాటికి లక్నో బ్యాటర్లు చేతులెత్తిసిన పరిస్థితి నెలకొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఈ సీజన్‌లో బెంగళూరుకు ఐదో విజయం
Match 43. Royal Challengers Bangalore Won by 18 Run(s) https://t.co/jbDXvbwuzm #TATAIPL #LSGvRCB #IPL2023
— IndianPremierLeague (@IPL) May 1, 2023