Rohit Sharma: రోహిత్ శర్మకు పద్మశ్రీ.. క్రికెట్‌లో సాధించిన రికార్డులివే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్‌కు చెందిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు మరో అరుదైన గౌరవం లభించనుంది. ముంబైలోని ప్రతిష్ఠాత్మక డీవై పాటిల్ యూనివర్సిటీ రోహిత్ శర్మకు పద్మశ్రీ లభించింది. క్రీడారంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాలు, అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి తెచ్చిన ఖ్యాతిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేశారు. భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత టీమిండియాకు ప్రపంచకప్‌ను అందించిన మూడవ కెప్టెన్‌గా ఆయన రికార్డు సృష్టించారు. రోహిత్ నాయకత్వంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడమే కాకుండా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. అంతేకాదు, ఆసియా కప్ టైటిళ్లను కూడా ఆయన కెప్టెన్సీలో భారత జట్టు సాధించింది.
Details
వన్డే ఫార్మాట్‌లో మూడు డబుల్ సెంచరీలు
జట్టును ముందుండి నడిపించడంలో, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో రోహిత్ అనుసరించే విధానం ఎంతో ప్రత్యేకమని క్రికెట్ నిపుణులు ప్రశంసిస్తుంటారు. రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ గణాంకాలు కూడా ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇప్పటివరకు 67 టెస్టులు, 282 వన్డేలు, 159 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 4,301 పరుగులు, వన్డేల్లో 11,577 పరుగులు, టీ20ల్లో 4,231 పరుగులు చేసి రికార్డులు నెలకొల్పారు. వన్డే ఫార్మాట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ శర్మ పేరిట ప్రపంచ రికార్డు ఉంది. ప్రస్తుతం ఆయన కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే అందుబాటులో ఉండగా, టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.