
IND vs PAK - Post Match Presentation: పాక్ కెప్టెన్ గైర్హాజరు.. భారత్‌పై ఓటమి తర్వాత ఎందుకిలా? కోచ్ క్లారిటీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్‌లో మరోసారి పాకిస్థాన్ జట్టు భారత్ చేతిలో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పాక్‌ను అలవోకగా ఓడించింది. మ్యాచ్ అనంతరం భారత సారథి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి బాధితులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. మ్యాచ్‌కు ముందు 'ఎవరినైనా ఓడిస్తాం' అంటూ ధీమా వ్యక్తం చేసిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా, ఓటమి తర్వాత మాత్రం ప్రెజెంటేషన్ సెరిమనీలో పాల్గొనకపోవడం గమనార్హం. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. పాక్ ఆటగాళ్లు ముందుకు వచ్చినప్పటికీ, భారత్ నుంచి స్పందన లేకపోవడంతోనే సల్మాన్ అఘా అలా వ్యవహరించి ఉంటాడని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.
Details
వెంటనే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయిన భారత ఆటగాళ్లు
ఈ విషయంపై పాక్ కోచ్ మైక్ హెసెన్ స్పందించారు. సల్మాన్ అఘా ప్రెజెంటేషన్‌లో మాట్లాడకపోవడం అనుకోకుండా జరిగిన ఘటన. మ్యాచ్ ముగిసిన తర్వాత మేమంతా కరచాలనం చేసేందుకు సిద్ధమయ్యాం. కానీ, భారత్ ఆటగాళ్లు వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. ఆ విధానం నిరుత్సాహపరిచింది. మా జట్టు కూడా ఈ మ్యాచ్‌లో అసలు స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయిందని హెసెన్ స్పష్టం చేశారు. ఇక భారత్ నుంచి కూడా దీనిపై వివరణ వెలువడింది.
Details
కరచాలనం చేయకుండా వెళ్లిపోయిన ఆటగాళ్లు
ఆసియా కప్‌కు ముందు నుంచే పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడొద్దని 'బాయ్‌కాట్' ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు ప్రత్యేక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. పాక్ క్రికెటర్లతో ఎలాంటి టచ్‌లో ఉండొద్దని ఆయన స్పష్టంగా చెప్పారని సమాచారం. అందుకే మ్యాచ్ సమయంలోనే కాదు, అనంతరం కూడా భారత ఆటగాళ్లు కరచాలనం చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. పాక్ ఆటగాళ్ల కళ్లముందే తలుపులు మూసేసిన ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.