తదుపరి వార్తా కథనం
    
     
                                                                                Asian Games 2023 : పాకిస్థాన్ చిత్తు చేసిన భారత్.. ఫైనల్లో ఇరాన్‌తో ఢీ
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Oct 06, 2023 
                    
                     06:28 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత కబడ్డీ జట్టు సంచలనం సృష్టించింది. సెమీ-ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా భారత్ ఓడించింది. ఆట మొదలైనప్పటి నుంచి పాక్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఇండియా 64-14 పాయింట్ల తేడాతో గెలుపొందింది. పాక్ పై విజయంతో భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓటమి చెందకుండా విజయపరంపర కొనసాగిస్తోంది. ఇక ఫైనల్లో భారత్ జట్టు ఇరాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాకిస్థాన్ పై విజయం సాధించిన భారత్
India beat Pakistan by 61-14 in Kabaddi semifinal at #AsianGames pic.twitter.com/rxOtuUYLY5
— ANI (@ANI) October 6, 2023