Loading...
Harshit Rana: హర్షిత్ రాణాపై పాకిస్థాన్ ఫిర్యాదు.. తదుపరి చర్యలపై ఉత్కంఠ!
హర్షిత్ రాణాపై పాకిస్థాన్ ఫిర్యాదు.. తదుపరి చర్యలపై ఉత్కంఠ!

Harshit Rana: హర్షిత్ రాణాపై పాకిస్థాన్ ఫిర్యాదు.. తదుపరి చర్యలపై ఉత్కంఠ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా A జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై పాకిస్థాన్ A జట్టు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నవంబర్ 22న ముగిసిన ఇరు జట్ల మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఘటనలపై పాకిస్థాన్ జట్టు కంప్లైంట్ చేసినట్టు సమ్మా న్యూస్ తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా భారత పేసర్ హర్షిత్ రాణా పేరును మ్యాచ్ రిఫరీకి సమర్పించినట్టు తెలిపింది.

వివరాలు

మైదానంలో ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం

ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మ్యాచ్ ఆసాంతం వాతావరణం వేడెక్కగా.. చివరకు పాకిస్థాన్ A జట్టు విజయం సాధించింది.

అయితే మ్యాచ్ సందర్భంగా జరిగిన పలు ఉద్రిక్త ఘటనల్లో హర్షిత్ రాణా కేంద్ర బిందువుగా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడితో పాటు ఇతర ఇండియా A ఆటగాళ్ల ప్రవర్తనపైనా పాకిస్థాన్ జట్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

మ్యాచ్ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

పాకిస్థాన్ A జట్టు చేసిన ఫిర్యాదుపై మ్యాచ్ రిఫరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ADVERTISEMENT