SA vs PAK: సౌతాఫ్రికాపై తొలి టీ20కి పాకిస్థాన్ సర్‌ప్రైజ్.. కొత్త జెర్సీతో బరిలోకి!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20లో పాకిస్థాన్ జట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎందుకంటే ఈసారి తమ సంప్రదాయ గ్రీన్ జెర్సీని పక్కనబెట్టి, ప్రత్యేకమైన పింక్ జెర్సీలో మైదానంలోకి దిగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ బాధితులకు సంఘీభావం తెలపడం, వారికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పింక్ జెర్సీలు ధరించాలని నిర్ణయించింది.
Details
పింక్ దుస్తుల్లో మెరవనున్న ఆటగాళ్లు
అక్టోబర్ 28న జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు పింక్ దుస్తుల్లో మెరవనున్నారు. ఇప్పటికే పాక్ ఆటగాళ్లు పింక్ జెర్సీలు ధరించి ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ కొత్త లుక్‌పై స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, పాక్, దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ఇప్పటికే ముగిసింది. చెరో జట్టు ఒక మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఇప్పుడు అన్ని కళ్లూ రేపటి టీ20 సిరీస్‌పై ఉన్నాయి. రావల్పిండిలో జరగనున్న తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పింక్ జెర్సీ అవతార్‌తో పాక్ ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.