తదుపరి వార్తా కథనం

IND vs ENG: రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ ఎంపికపై ఇమామ్ కీలక కామెంట్స్
వ్రాసిన వారు
Stalin
Jan 30, 2024
11:10 am
ఈ వార్తాకథనం ఏంటి
భారత యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను టీమిండియాలోకి తీసుకున్నారు.
సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి రావడంపై అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అతనికి టీమ్ ఇండియాలో చోటు దక్కడంపై పాకిస్థాన్ నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి రావడం పట్ల పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ చాలా సంతోషం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అభినందించారు. 'నీ ఎంపిక పట్ల చాలా సంతోషంగా ఉన్నా' అంటూ ఇమామ్ పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇమామ్ ట్వీట్
Congratulations brother So Happy for you ❤️❤️ pic.twitter.com/TDmKXMZYjj
— Imam Ul Haq (@ImamUlHaq12) January 29, 2024