Page Loader
Pakistan Team : ఐశ్వర్యరాయ్‌పై పాక్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్
ఐశ్వర్యరాయ్‌పై పాక్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్

Pakistan Team : ఐశ్వర్యరాయ్‌పై పాక్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2023
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ జట్టుపై పాక్ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తారు. ఈ క్రమంలో పాక్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ పాక్ జట్టును విమర్శిస్తూ, ఐశ్వర్యరాయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్య అభిమానులు అబ్దుల్ రజాక్‌పై ఫైర్ అయ్యారు. మంచి ఆటగాళ్లను తయారు చేయాలని కానీ, పాక్‌లో క్రికెట్‌ను మెరుగుపర్చాలని కానీ తమకు లేదని పాక్ బోర్డును ఉద్ధేశించి రజాక్ వ్యాఖ్యానించాడు. ఇక్కడితో అగకుండా ఐశ్వర్యరాయ్‌ని పెళ్లిచేసుకోవడం వల్ల మంచి పిల్లలు పుడతారని అనుకుంటే పొరపాటేనని, అలా ఎప్పటికి జరగదని దారుణ వ్యాఖ్యలు చేశారు.

Details

అబ్దుల్ రజాక్ పై మండిపడుతున్న నెటిజన్లు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉద్ధేశం తనకు అర్థం కావడం లేదని, తాను ఆడే సమయంలో అప్పటి కెప్టెన్ యూనిస్ ఖాన్ జట్టును నడిపిన తీరును అత్యుత్తమంగా ఉండేదని రజాక్ వెల్లడించారు. ఇక ఈ చర్చా కార్యక్రమంలో షాహిది అఫ్రిది, ఉమర్ గుల్, యూనిస్ ఖాన్, సయీద్ అజ్మల్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్ వంటి మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. పెళ్లయిన మహిళ గురించి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని నెటిజన్లు రజాక్‌పై మండిపడుతున్నారు.