Smriti Mandhana : అవును.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు.. స్మృతి మంధాన, పలాష్ పెళ్లి చేసుకోబోతున్నారా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ ఇద్దరూ మళ్లీ ఒకటవుతారనే ఊహాగానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. ఆ వీడియోలో పలాష్ ముచ్చల్ సోదరి పలక్ ముచ్చల్, ఆమె భర్త మిథున్‌తో కలిసి స్మృతి మంధాన తండ్రితో కనిపించారు. ఈ సంఘటన ముంబైలోని ఒక రెస్టారెంట్ వెలుపల జరిగినట్లు సమాచారం. వీడియోలో పలక్ ముచ్చల్ స్మృతి తండ్రికి నమస్కారం చేయగా, ఆయన ఆమెను ఆశీర్వదించడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనితో ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు సానుకూలంగా కొనసాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వివరాలు
మళ్లీ కలిశారా?
ఇంతకుముందు, 2025 నవంబర్‌లో స్మృతి మందాన్న, పలాష్ ముచ్చల్ వివాహ నిశ్చితార్థం జరిగిందని సమాచారం. పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ వివాహానికి ముందురోజే ఈ సంబంధం క్యాన్సిల్ అయ్యింది. పలాష్ ముచ్చల్ మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో ఈ వివాహం ఆగిపోయిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను పలాష్ ముచ్చల్ పలు సందర్భాల్లో ఖండించాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోతో ఇద్దరూ మళ్లీ కలిసే అవకాశముందనే చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. కొంతమంది అభిమానులు ఈ జంట మళ్లీ ఒక్కటవుతుందని ఆశ వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై స్మృతి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.