Paris Olympics 2024: ముగిసిన పారిస్ ఒలింపిక్స్.. టాప్‌లో అమెరికా! భారత్ స్థానం ఎంతంటే
దాదాపు మూడు వారాల పాటు సాగిన పారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024 ముగింపు దశకు చేరుకుంది. ఈసారి షూటర్ మను భాకర్ నుంచి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరకు అందరూ తమ శాయశక్తులా ప్రయత్నించినా భారత్ 6 పతకాలకు మించి తీసుకురాలేకపోయింది. ఈ ఒలింపిక్స్‌లో మను 2 కాంస్యం సాధించగా, నీరజ్‌కి ఏకైక రజతం లభించింది. భారతదేశం పాల్గొనప్పుడు 1898లో తొలిసారిగా ఒలింపిక్స్‌ను నిర్వహించారు. కానీ 1900లో, భారతదేశం మొదటిసారి పాల్గొనగా, 200 మీటర్ల రేసులో నార్మన్ ప్రిచర్డ్ అనే ఏకైక అథ్లెట్ 2 రజత పతకాలను గెలుచుకున్నాడు. నార్మన్ ప్రిచర్డ్ బ్రిటీష్ జెండా కింద భారతదేశం కోసం పాల్గొన్నాడు, అతను బ్రిటిష్ మూలానికి చెందిన ఆటగాడు.
వినేష్ పతకం సాధిస్తే మొత్తం 7 పతకాలు
అయితే ఆ తర్వాత 2008 బీజింగ్‌లో తొలిసారిగా భారత్ 2 లేదా 3 పతకాలను సాధించింది. దీని తర్వాత లండన్ 2012 ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ 1స్వర్ణంతో సహా మొత్తం 7పతకాలు సాధించడంతో దాని రికార్డు బద్దలైంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో టోక్యో రికార్డును బద్దలు కొట్టడానికి ఒక సువర్ణావకాశం ఉంది,కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. ఈసారి భారత్ 1రజతం సహా 6పతకాలు మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే,రెజ్లర్ వినేష్ ఫోగట్ కేసు కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో ఇంకా కొనసాగుతోంది. ఆగస్టు 13న నిర్ణయం వెలువడనుంది. ఒకవేళ నిర్ణయం అనుకూలంగా ఉంటే వినేష్‌కి రజతం దక్కే అవకాశం ఉంది.
ప్రేక్షకులను అలరించిన నృత్యకారులు, సంగీత కళాకారులు
అప్పుడు భారత్ పతకాల సంఖ్య 7 అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ రికార్డు సమం కానుంది. కానీ ప్రస్తుతం 6 పతకాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే,భారత్ ఇప్పటికీ తన టోక్యో రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం 41 పతకాలు సాధించింది. ఇందులో 10స్వర్ణాలు, 10 రజతాలు,21కాంస్య పతకాలు ఉన్నాయి. జులై 26న ఒలింపిక్స్ ప్రారంభం కాగా.. ఆగష్టు 11న సమాప్తం అయ్యాయి.సెన్ నది వేదికగా ఒలింపిక్స్ వేడుకలకు బీజం పడగా.. స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో సమాప్తమయ్యాయి. నృత్యకారులు, సంగీత కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. మన దేశం తరఫున షూటర్ మను బాకర్,హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేష్ పతకధారులుగా వ్యవహరించారు.
పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో అమెరికా
2028 ఒలింపిక్స్ పోటీలు లాస్ ఏంజెలెస్ వేదికగా జరగనున్నాయి.ఈసారి ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో 329స్వర్ణ పతకాలకు 206 దేశాలకు చెందిన 10,714మంది క్రీడాకారులు పోటీపడ్డారు. అమెరికా 40 స్వర్ణాలతో టాప్‌లో నిలిచింది.ఆఖరి రోజు చైనాను వెనక్కి నెట్టిన అమెరికా..పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని ఆక్రమించింది. ఒలింపిక్స్ చివరి పోటీలు అయిన మహిళ బాస్కెట్‌బాల్‌లో అమెరికా జట్టు స్వర్ణ పతకాన్ని గెలిచింది. అమెరికా 40 స్వర్ణ పతకాలతో సహా మొత్తంగా 126 పతకాలను సాధించింది. చైనా 40స్వర్ణాలతో పాటు మొత్తం 91 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. జపాన్ 20 బంగారు పతకాలతో మూడు స్థానంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో 7 పతకాలతో 48వ స్థానంలో నిలిచిన భారత్.. ఈసారి 71వ స్థానంకు పడిపోయింది.