Page Loader
Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024 భారతదేశ పతకాల విజేతల జాబితా 
పారిస్ పారాలింపిక్స్ 2024 భారతదేశ పతకాల విజేతల జాబితా

Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024 భారతదేశ పతకాల విజేతల జాబితా 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2024
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే 2024 పారిస్ పారాలింపిక్స్‌లో భారతదేశం రికార్డు స్థాయిలో 84 మంది పారా అథ్లెట్లను ప్రాతినిధ్యం వహిస్తోంది. 12 విభాగాల్లో భారత్ పోటీపడుతోంది. ఇప్పటివరకు 15 పతకాలు సాధించి 15వ స్థానంలో నిలిచింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేడు షూటింగ్‌, షాట్‌పుట్, హైజంప్, జావెలిన్‌ పోటీలలో భారత పారా అథ్లెట్లు పోటీ పడనున్నారు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అత్యధిక పతకాలను సాధించింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు సహా మొత్తం 19 పతకాలు ఉన్నాయి.

వివరాలు 

కొత్త క్రీడలలో పారా సైక్లింగ్, పారా రోయింగ్, బ్లైండ్ జూడో  

పారిస్ పారాలింపిక్స్‌లో ఇప్పటికే 15 మెడల్స్ సాధించి, రికార్డు స్థాయి పతకాల దిశగా ముందుకు సాగుతోంది. ఈ సారి పారా సైక్లింగ్, పారా రోయింగ్, బ్లైండ్ జూడో వంటి కొత్త క్రీడలలో కూడా భారతీయ పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. సోమవారం ప్రదర్శన చేసిన షట్లర్లు ఒకే రోజు నాలుగు పతకాలు సాధించిగా.. డిస్కస్‌ త్రో, ఆర్చరీలో కూడా మెడల్స్ సాధించారు. పతక విజేతల పూర్తి జాబితాను ఒకసారి చూద్దాం.

వివరాలు 

పతక విజేతల జాబితా

1 అవని ​​లేఖా - షూటింగ్ - మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 -స్వర్ణం 2 మోనా అగర్వాల్ - షూటింగ్ - మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 -కాంస్యం 3 ప్రీతి పాల్ - అథ్లెటిక్స్ - మహిళల 100మీ T35 -కాంస్యం 4 మనీష్ నర్వాల్ - షూటింగ్ -పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ SH1 -రజతం 5 రుబీనా ఫ్రాన్సిస్ - షూటింగ్ - మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ SH1 -కాంస్యం 6 ప్రీతి పాల్ - అథ్లెటిక్స్- మహిళల 200 మీటర్ల T35 - కాంస్యం 7 నిషాద్ కుమార్ - అథ్లెటిక్స్ - పురుషుల హైజంప్ T47 -రజతం

వివరాలు 

పతక విజేతల జాబితా

8 యోగేష్ కథునియా - అథ్లెటిక్స్ - పురుషుల డిస్కస్ త్రో F56 - రజతం 9 నితీష్ కుమార్ - బ్యాడ్మింటన్ - పురుషుల సింగిల్స్ SL3 - స్వర్ణం 10 తులసిమతి మురుగేషన్ - బ్యాడ్మింటన్ - మహిళల సింగిల్స్ SU5 - రజతం 11 మనీషా రామదాస్ - బ్యాడ్మింటన్ - మహిళల సింగిల్స్ SU5 - కాంస్యం

వివరాలు 

పతక విజేతల జాబితా

12 సుహాస్ యతిరాజ్ - బ్యాడ్మింటన్ - పురుషుల సింగిల్స్ SL4 - రజతం 13 రాకేష్ కుమార్ / శీతల్ దేవి - ఆర్చరీ - మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ - కాంస్యం 14 సుమిత్ యాంటిల్ - అథ్లెటిక్స్ - జావెలిన్ త్రో F64 - స్వర్ణం 15 నిత్య శ్రీ శివన్ - బ్యాడ్మింటన్ - మహిళల సింగిల్స్ SH6 - కాంస్యం