LOADING...
Matheesha Pathirana: చదువు, సంగీతాన్ని వదిలి.. ధోనీ ప్రేరణతో క్రికెట్‌ స్టార్‌గా ఎదిగిన పతిరన!
చదువు, సంగీతాన్ని వదిలి.. ధోనీ ప్రేరణతో క్రికెట్‌ స్టార్‌గా ఎదిగిన పతిరన!

Matheesha Pathirana: చదువు, సంగీతాన్ని వదిలి.. ధోనీ ప్రేరణతో క్రికెట్‌ స్టార్‌గా ఎదిగిన పతిరన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2025
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎంఎస్ ధోని యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు. టీమిండియా కెప్టెన్ కూల్'గా ఉన్నప్పుడే కొత్త ఆటగాళ్లకు అవకాశాలిచ్చిన ధోనీ, ఇప్పుడు ఐపీఎల్‌లోనూ కుర్రాళ్లకు బాసటగా నిలుస్తున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక పేసర్ మతీశా పతిరన ముందు వరుసలో ఉంటాడు. పతిరనను స్టార్‌గా మార్చింది ధోనీనే, అందుకే అతడు ధోనీని 'క్రికెట్ ఫాదర్' అని పిలుస్తాడు. అయితే పతిరన క్రికెట్‌ను ఎంచుకోవడం వెనుక ఆసక్తికర కథ ఉంది. సంగీత కుటుంబం.. పైలట్ కావాలనుకున్న తల్లి మతీశా పతిరన చిన్నప్పటి నుంచే సంగీత వాయిద్యాలను ఆసక్తిగా నేర్చుకున్నాడు. సర్టిఫైడ్ పియానిస్ట్, సింగర్ అయిన పతిరన కుటుంబం సంగీతంలో మంచి పేరు కలిగిన కుటుంబం.

Details

బేస్‌బాల్ ప్లేయర్‌గా ప్రారంభం

కానీ అతడు క్రికెట్‌లో తన ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. అతడి సోదరీమణులు తనను ప్రయోగశాలలో కుందేలుగా భావించేవారని సరదాగా చెబుతుంటారు. అతడి తల్లిదండ్రులు అనురా, షైలికా పాటలు పాడుతారు. మతీశా తల్లి తన కుమారుడు బాగా చదివి పైలట్ కావాలని కోరుకుంది. చదువు, సంగీతాన్ని పక్కనపెట్టి పతిరన క్రీడల్లోకి వచ్చాడు. అయితే, మొదట క్రికెట్‌ కాకుండా బేస్‌బాల్ ఆడేవాడు. ఏడో తరగతి వరకు క్రికెట్ గురించి అస్సలు తెలియదు. కానీ అతడి సహజమైన యాక్షన్‌ను చూసిన సీనియర్లు బౌలర్‌గా ఆడమని ప్రోత్సహించారు. అయితే చదువుతో పాటు ఆడాలనే షరతు పెట్టినా, అతడు పుస్తకాల వైపు చూడకపోవడం తల్లి షైలికాను ఆశ్చర్యపరిచింది.

Details

స్టార్‌గా మారిన పతిరన

శ్రీలంక దిగ్గజ బౌలర్ చమింద వాస్ సూచనతో పతిరన కొలంబోలోని ట్రినిటీ కళాశాలలో చేరాడు. అక్కడే టర్ఫ్ వికెట్‌పై ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన వీడియో వైరల్ అయింది. అతడు అండర్ -19 జట్టులోకి వచ్చాడు, అక్కడ పెద్దగా రాణించలేకపోయినా అందరి దృష్టిని ఆకర్షించాడు. సీఎస్కే వీడియో అనలిస్ట్ లక్ష్మీ నారాయణన్ ఆ వీడియోను గమనించి CSK మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు. అప్పటికి ధోనీ పతిరనను చూడలేదు. కానీ నెట్స్‌లోనే అతడిని చూసి అద్భుత ప్రతిభ ఉందని గుర్తించాడు. అబుదాబి టీ10 లీగ్‌లో పతిరన రాణించడంతో CSK అతడిని 2022లో నెట్స్ బౌలర్‌గా ఎంపిక చేసింది. ఆ సీజన్‌లో ఆడమ్ మిల్నే గాయపడడంతో సీఎస్కే అధికారికంగా పతిరనను జట్టులో చేర్చుకుంది.

Details

పతిరన భావోద్వేగ వ్యాఖ్యలు

ధోనీని తాను తండ్రిలా భావిస్తానని, తన క్రికెట్ కెరీర్ ఇలా మారడానికి అతడి ప్రోత్సాహమే కారణమన్నారు. ఇంట్లో తన తండ్రి నన్ను ఎలా గైడ్ చేస్తారో.. క్రికెట్‌లో ధోనీ అలా మద్దతుగా నిలిచారని కొనియాడారు. రూ. 13 కోట్లకు రిటైన్ 2024 సీజన్‌లో పతిరన కేవలం 6 మ్యాచులే ఆడాడు. అయినా కూడా సీఎస్కే అతడిపై నమ్మకం ఉంచి రూ. 13 కోట్లకు రిటైన్ చేసింది. 2023లో చెన్నై విజేతగా నిలిచేందుకు కీలకంగా వ్యవహరించిన పతిరన, ఆ సీజన్‌లో 12 మ్యాచుల్లో 19 వికెట్లు పడగొట్టి కీలక భూమిక పోషించాడు. ధోనీ గైడెన్స్‌తో పతిరన కెరీర్ కొత్త ఎత్తుకి చేరుకుంది. రాబోయే సీజన్లలో సీఎస్కేకి అతడు ఇంకా ఎక్కువ సేవలు అందించనున్నాడు.