PBKS vs DC: పంజాబ్ కింగ్స్ కు చావోరేవో
ఇండియన్ ప్రీమియర్ లో భాగంగా 64వ మ్యాచ్ లో మరో కీలక పోరు జరగనుంది. నేడు ధర్మశాల స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే పంజాబ్ కింగ్స్ ఫ్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే ఆ జట్టు కూడా అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. ఇప్పటివరకూ 12 మ్యాచుల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్.. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఫ్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ పంజాబ్ కి చావో రేవో లా మారింది. ధర్మశాల స్టేడియం పేసర్లకు అనుకూలంగా ఉండనుంది.
విజయంపై కన్నేసిన పంజాబ్ కింగ్స్
ఇప్పటివరకూ ఈ రెండు జట్ల మధ్య 30 మ్యాచులు జరగ్గా.. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 15 మ్యాచులు గెలిచాయి. నేటి మ్యాచులో విజయం సాధించి ఫ్లే ఆఫ్స్ కి అర్హత సాధించాలని పంజాబ్ గట్టి పట్టుదలతో ఉంది. పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ధావన్ (కెప్టెన్), లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్-కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్. ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్-కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.