Page Loader
IPL: అహ్మదాబాద్‌కు మారిన ముంబయి-పంజాబ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ 
అహ్మదాబాద్‌కు మారిన ముంబయి-పంజాబ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌

IPL: అహ్మదాబాద్‌కు మారిన ముంబయి-పంజాబ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఆపరేషన్ సిందూర్' వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఉత్తర భారతదేశంలోని కొన్ని విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేశారు. ఈ పరిణామం ఐపీఎల్‌పై కూడా ప్రభావం చూపింది. ముంబయి ఇండియన్స్‌, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మే 11న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ను వేరే ప్రదేశానికి మార్చారు. ఈ మ్యాచ్‌ను ధర్మశాల బదులు అహ్మదాబాద్‌కు మారుస్తున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ధృవీకరించారు. "బీసీసీఐ ముంబయి-పంజాబ్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించాలని కోరింది. మేమూ అందుకు ఒప్పుకున్నాం. ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు ఈ రోజు అహ్మదాబాద్‌ చేరుకుంటారు. కానీ పంజాబ్ జట్టు ప్రయాణ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది," అని అనిల్ పటేల్ తెలిపారు.

వివరాలు 

షెడ్యూల్ ప్రకారమే పంజాబ్ కింగ్స్‌,ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌

ధర్మశాల విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేయటంతో ముంబయి జట్టు అక్కడకు వెళ్లకపోవడానికి కారణమని సమాచారం. ఇదిలా ఉండగా, ధర్మశాలలో ఇవాళ పంజాబ్ కింగ్స్‌,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌ షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు ఇప్పటికే ధర్మశాలకు చేరుకోవడంతో ప్రయాణ సమస్యలు ఎదురుకాలేదు. అయితే, సాయంత్రం మ్యాచ్ సందర్భంగా ఫ్లడ్‌లైట్లను ఉపయోగించడం భద్రతాపరంగా సమస్యగా మారినట్టు తెలుస్తోంది. దీంతో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న విషయంపై అనిశ్చితి నెలకొనగా... ఇప్పుడు మాత్రం స్పష్టత ఏర్పడింది.