PCB: పాకిస్థాన్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరిచేందుకు రంగంలోకి ఆర్మీ
పాకిస్థాన్ జట్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను వేగంగా మెరుగుపర్చేందుకు, మైదానంలో సులభంగా భారీ సిక్సర్లు కొట్టేందుకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఓ విచిత్రమైన ప్రణాళికను రూపొందించారు. 2024 టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆర్మీ ఆధ్వర్యంలో శిక్షణను ఇవ్వనున్నట్లు వెల్లిడించారు. ఈ శిక్షణ శిబిరం మార్చి 25నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనుంది. ఇస్లామాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు పాకిస్థాన్ ప్లేయర్ల ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పీఎస్ఎల్ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌లో.. తాను మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒక ఆటగాడు కూడా బంతిని నేరుగా బంతిని స్టాండ్స్‌లోకి పంపించలేకపోయారని చెప్పారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ వేగంగా మెరుగుపడేలా ఆర్మీతో శిక్షణను ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.