NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Aus vs Eng:యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల.. యాషెస్ సిరీస్ ఓపెనింగ్ టెస్ట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న పెర్త్ 
    తదుపరి వార్తా కథనం
    Aus vs Eng:యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల.. యాషెస్ సిరీస్ ఓపెనింగ్ టెస్ట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న పెర్త్ 
    యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల

    Aus vs Eng:యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల.. యాషెస్ సిరీస్ ఓపెనింగ్ టెస్ట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న పెర్త్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 16, 2024
    02:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ తాజా ఎడిషన్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించింది.

    పెర్త్‌ వేదికగా వచ్చే ఏడాది నవంబరు 21 నుంచి ఇరుజట్ల మధ్య టెస్టులు ప్రారంభమవుతాయని తెలిపింది.

    అదేవిధంగా, పింక్‌ బాల్‌తో జరిగే రెండో టెస్టుకు ఐకానిక్‌ గాబా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొంది.

    ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టుకు అడిలైడ్‌ ఓవల్‌ మైదానం, బాక్సింగ్‌ డే మ్యాచ్‌కు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ), ఆఖరి టెస్టుకు సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికలు ఉంటాయని సీఏ తెలిపింది.

    అయితే, యాషెస్‌ సిరీస్‌లో తొలి టెస్టుకు పెర్త్‌ ఆతిథ్యం ఇవ్వడం 43 సంవత్సరాల తర్వాత ఈసారి జరుగుతోంది.

    వివరాలు 

    ఇంగ్లండ్‌లోడ్రా 

    ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన గత యాషెస్‌ సిరీస్‌ 2-2తో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.తొలి రెండు టెస్టుల్లో ఆసీస్‌ గెలవగా, మూడో టెస్టులో ఫలితం తేలలేదు. నాలుగవ, ఐదవ టెస్టుల్లో ఇంగ్లండ్‌ గెలిచింది. ఈ ప్రతిష్టాత్మక తాజా సిరీస్‌ కంగారూ గడ్డపై జరుగనుంది.

    ఆసీస్‌ గడ్డపై గెలుపునకు తహతహ

    2010 నుండి ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఒక్కసారి కూడా గెలవలేదు.

    2010లో 3-1తో ఓడిన ఇంగ్లిష్‌ జట్టు ఆ తర్వాత ఇప్పటివరకు మూడుసార్లు ఆసీస్‌ పర్యటనకు వెళ్లింది. ఆడిన 15 టెస్టుల్లో 13 ఓడిపోయి,రెండు డ్రా చేసుకుంది.

    ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ)2021-2023 గెలిచిన ఆస్ట్రేలియా తదుపరి స్వదేశంలో టీమిండియాతో ఐదు టెస్టులు ఆడనుంది.

    వివరాలు 

    ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇంగ్లండ్‌- యాషెస్‌ సిరీస్‌-2025- 26 షెడ్యూల్‌ 

    ఈసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే,బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లు ఆసీస్‌కు కీలకంగా మారనున్నాయి.

    మొదటి టెస్టు- పెర్త్‌ స్టేడియం, నవంబరు 21-25, 2025

    రెండో టెస్టు- ది గాబా(డే, నైట్‌ పింక్‌బాల్‌ మ్యాచ్‌)- డిసెంబరు 4-8, 2025

    మూడో టెస్టు- అడిలైడ్‌ ఓవల్‌, డిసెంబరు 17- 21, 2025

    నాలుగో టెస్టు- ఎంసీజీ, డిసెంబరు 26- 30, 2025

    ఐదో టెస్టు- ఎస్‌సీజీ, జనవరి 4-8, 2026.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యాషెస్ సిరీస్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    యాషెస్ సిరీస్

    ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ సంచలన నిర్ణయం.. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ జట్టులోకి ఇంగ్లండ్
    Ashes 2023 : ఇంగ్లండ్ గడ్డపై స్మిత్, వార్నర్ సాధించిన రికార్డులివే! ఆస్ట్రేలియా
    యాషెస్ సమరానికి సర్వం సిద్ధం.. ఎక్కువ సిరీస్‌లు గెలిచిందే వీరే..? టీమిండియా
    యాషెస్ సిరీస్ కు ఆ పదం ఎలా వచ్చిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!  ఆస్ట్రేలియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025