Page Loader
India vs Australia: రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు 
India vs Australia: రెండో టీ20లోనూ టీమిండియా ఆధిపత్యాన్ని చలాయిస్తుందా?

India vs Australia: రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు 

వ్రాసిన వారు Stalin
Nov 26, 2023
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఆడుతోంది. మొదటి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో విజయం సాధించిన భారత్.. ఆదివారం ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడనుంది. కేరళలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సిరీస్‌లో ఆధిపత్యాన్ని కనబర్చాలని టీమిండియా భావిస్తోంది. మొదటి మ్యాచ్‌లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు కేవలం మూడు టీ-20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు ఒకసారి, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు రెండుసార్లు గెలిచింది. ఈ స్టేడియంలో భారత్ ఆడిన 2మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇందులో ఆస్ట్రేలియా ఒక్క గేమ్ కూడా ఆడలేదు.

టీ20

మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశం

గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే బౌలర్లదే ఆధిపత్యం ఉంటుంది. ఇక్కడి పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ స్టేడియంలో పెద్ద స్కోర్లు నమోదయ్యే అవకాశం తక్కువ. ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 114పరుగులని నివేదికలు చెబుతున్నాయి. ఈ మైదానంలో చివరి టీ20 మ్యాచ్ 2022లో జరిగింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు 106/8 మాత్రమే స్కోర్ చేసి ఓడిపోయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3వికెట్లు) ఈ మైదానంలో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. తిరువనంతపురంలో శనివారం వర్షం కురిసింది. అక్యూవెదర్ ప్రకారం, రెండో మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.