IPL 2026 - RCB: 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' స్పెషల్.. ఆర్సీబీలో రాణిస్తున్న విదేశీ ప్లేయర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ అద్భుత ఫామ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగింట విజయం సాధించిన బెంగళూరు జట్టు, బ్యాటింగ్-బౌలింగ్ విభాగాల్లో సమతూక ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తాజాగా బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో లక్నోపై గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కచ్చితమైన బౌలింగ్‌తో మెప్పించిన జోష్ హేజిల్‌వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు లభించింది. అయితే ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున ఇప్పటివరకు లభించిన నాలుగు POTM అవార్డులన్నీ విదేశీ ఆటగాళ్లకే దక్కడం విశేషం. అవి ఇలా ఉన్నాయి:
వివరాలు
విదేవీ ప్లేయర్స్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచులు
జాకబ్ డఫీ - సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై టిమ్ డేవిడ్ - చెన్నై సూపర్ కింగ్స్‌పై ఫిల్ సాల్ట్ - ముంబై ఇండియన్స్‌పై జోష్ హేజిల్‌వుడ్ - లక్నో సూపర్ జెయింట్స్‌పై ఇంకా విశేషం ఏమిటంటే 2025 సీజన్ నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ తరఫున మొత్తం 10 మంది భిన్న ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోవడం గమనార్హం. ఇతర జట్లలో ఇలాంటి అరుదైన రికార్డు కనిపించలేదు.
వివరాలు
లైన్ అండ్ లెంగ్త్ వల్లే విజయమంటున్న హేజిల్‌వుడ్
ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ సాధించిన జోష్ హేజిల్‌వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ, గత కొన్ని నెలలు నాకు సవాళ్లతో నిండిపోయాయి. గాయాలు ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ దెబ్బతో గత ఫామ్ దెబ్బతింది. అయితే ఈ మ్యాచ్‌లో లైన్ అండ్ లెంగ్త్‌పై దృష్టి పెట్టి బౌలింగ్ చేయగలిగాను. మరో ఎండ్ నుంచి మంచి సహకారం లభించింది. ఇది పూర్తిగా టీమ్ కృషేనని పేర్కొన్నాడు. తాను టెస్ట్ బౌలర్ కావడంతో స్లో బాల్స్ వేయడం కొంత కష్టంగా అనిపించిందని, అయితే దానిపై కసరత్తు చేస్తున్నానని తెలిపాడు.
వివరాలు
భువనేశ్వర్ తో నిరంతరం చర్చలు
అలాగే భువనేశ్వర్ కుమార్‌తో నిరంతరం చర్చలు జరుపుతుండటం జట్టుకు బలంగా మారిందని చెప్పాడు. అదే సమయంలో నాలుగు వికెట్లు తీసిన రాసిఖ్ దార్ గురించి మాట్లాడుతూ, "మొదట్లో కొన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయినా, వచ్చిన అవకాశాన్ని అతను అద్భుతంగా వినియోగించుకున్నాడని ప్రశంసించాడు. వరుసగా నాలుగు విజయాలు సాధించడం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, ముందున్న షెడ్యూల్ కూడా అనుకూలంగా ఉండటంతో ఇదే జోరును కొనసాగిస్తామని హేజిల్‌వుడ్ స్పష్టం చేశాడు.