
Bob Cowper : ఆస్ట్రేలియా గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బాబ్ కౌపర్ (Bob Cowper) ఇకలేరు. 84 ఏళ్ల వయసులో మెల్‌బోర్న్‌లో శనివారం తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో కొన్నేళ్లుగా పోరాడుతున్న ఆయన చివరకు మరణించారు.
కౌపర్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1966లో ఇంగ్లండ్‌తో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో ఆయన 307 పరుగులతో అద్భుత శతకాన్ని నమోదు చేశారు.
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో తొలి త్రిశతకం సాధించిన ఆటగాడిగా చరిత్రలో నిలిచారు. ఆ ఇన్నింగ్స్‌తో యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
Details
నాలుగేళ్ల క్రికెట్ కెరీర్
1964 నుంచి 1968 వరకు కౌపర్ 27 టెస్టులు ఆడి 2061 పరుగులు సాధించారు. ఆయన బ్యాటింగ్ సగటు 46.84 కాగా, ఐదు శతకాలు నమోదు చేశారు. పార్థ్‌టైమ్ స్పిన్నర్‌గా 36 వికెట్లు కూడా తీశారు.
కానీ 28 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి, వ్యాపార రంగంపై దృష్టి సారించారు.
దేశవాళీ క్రికెట్, రిఫరీ గానే కొనసాగింపు
విక్టోరియా జట్టు తరఫున 83 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కౌపర్, ఆటతీరి తర్వాత కూడా క్రికెట్‌కు దూరం కాలేదు. 1987 నుంచి 2001 వరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా సేవలందించారు.
ఈ క్రికెట్ సేవలకు గుర్తింపుగా ఆయనకు 2023లో 'ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా' అవార్డు లభించింది.
Details
క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం
బాబ్ కౌపర్ మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర సంతాపం ప్రకటించింది. చైర్మన్ మైక్ బైర్డ్ మాట్లాడుతూ, "కౌపర్ మృతి మనమందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఆయన అసాధారణ బ్యాటర్. మెల్‌బోర్న్‌లో చేసిన ట్రిపుల్ సెంచరీ ఇప్పటికీ మేం గుర్తుంచుకుంటాం. 1960లలో ఆస్ట్రేలియా క్రికెట్‌పై ఆయన కలిగించిన ప్రభావం అమోఘం.
ఆటగాడిగా, రిఫరీగా సేవలందించిన బాబ్‌కు మా గౌరవవందనం. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని తెలిపారు.
బాబ్ కౌపర్‌కు భార్య డేల్, కుమార్తెలు ఒలీవియా, సెరా ఉన్నారు.