Page Loader
టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మకు టోఫిని అందించిన ప్రధాని మోదీ
కెప్టెన్ రోహిత్ శర్మకు క్యాప్‌ను అందించిన ప్రధాని మోదీ

టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మకు టోఫిని అందించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 09, 2023
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆకరి టెస్టు అహ్మదాబాద్‌లో జరుగుతోంది. తొలి మూడు టెస్టులో రెండింటిలో నెగ్గిన భారత్ 2-0తో అధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టులో భారత్ గెలిస్తే సిరీస్‌తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కూడా అడుగు పెట్టనుంది. ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియంగా ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు ప్రత్యేక అతిథులుగా ప్రధాని మోదీ, ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ హాజరయ్యారు. ఇక మ్యాచ్‌కు ముందు అద్భుత దృశ్యం చోటు చేసుకుంది. ఇరు దేశాల ప్రధానులు తమ కెప్టెన్లకు క్యాప్‌లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ లతో కలిసి మోదీ, ఆంథోని అల్బనీస్ లు అభివాదం పలికారు

రోహిత్‌శర్మ

మోదీకి ఆటగాళ్లను పరిచయం చేసిన కెప్టెన్ రోహిత్‌శర్మ

ఇండియా - ఆస్ట్రేలియా మ‌ధ్య స్నేహ సంబంధాలు మొద‌లై 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా అహ్మ‌దాబాద్ టెస్ట్‌కు మోదీ, ఆల్బ‌నీజ్ హాజ‌ర‌య్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ భారత ఆటగాళ్లందరినీ ప్రధాని మోదీకి పరిచయం చేశారు. ఈ మ్యాచ్‌లో ‌టాస్ నెగ్గిన స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. మొహమ్మద్ సిరాజ్ కు రెస్ట్ ఇచ్చి.. అతడి స్థానంలో మొహమ్మద్ షమీని తీసుకుంది. ఆస్ట్రేలియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 60 ఓవర్లలో 146 పరుగులు చేసి రెండు వికెట్లను కోల్పోయింది.