LOADING...
Praggnanandhaa: గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో ప్రజ్ఞానందకు రెండో స్థానం
గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో ప్రజ్ఞానందకు రెండో స్థానం

Praggnanandhaa: గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో ప్రజ్ఞానందకు రెండో స్థానం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 03, 2026
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా నిర్వహిస్తున్న జాగ్రెబ్‌ అంచె పోటీల్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద ఆకట్టుకునే ప్రదర్శనతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. ర్యాపిడ్‌ విభాగంలో జరిగిన తొలి మ్యాచ్‌లో అగ్రశ్రేణి ఆటగాడు విన్సెంట్‌ కీమర్‌ (జర్మనీ)పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. అనంతరం జరిగిన మ్యాచ్‌ల్లో మాక్సిమ్‌ లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌), దొమ్మరాజు గుకేశ్‌తో డ్రా ఫలితాలను నమోదు చేశాడు.

వివరాలు

5 పాయింట్లతో అగ్రస్థానం..

టోర్నీలో ఫ్రాన్స్‌కు చెందిన ఫిరౌజా అలీరెజా మొత్తం 5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రజ్ఞానందతో పాటు మాక్సిమ్‌ లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌), విన్సెంట్‌ కీమర్‌ (జర్మనీ), అనీష్‌ గిరి (నెదర్లాండ్స్‌) తలో 4 పాయింట్లు సాధించి సంయుక్తంగా రెండో స్థానాన్ని పంచుకుంటున్నారు. మరోవైపు, దొమ్మరాజు గుకేశ్‌, రొమేనియాకు చెందిన బొగ్డాన్‌ డానియెల్‌ చెరో 3 పాయింట్లతో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు.

Advertisement