LOADING...
LSG vs GT: లక్నోను వణికించిన ప్రసిద్ కృష్ణ.. గుజరాత్‌ ముందు స్వల్ప టార్గెట్
లక్నోను వణికించిన ప్రసిద్ కృష్ణ.. గుజరాత్‌ ముందు స్వల్ప టార్గెట్

LSG vs GT: లక్నోను వణికించిన ప్రసిద్ కృష్ణ.. గుజరాత్‌ ముందు స్వల్ప టార్గెట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2026
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు గుజరాత్ టైటాన్స్‌తో ఏకనా స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆశించిన స్థాయిలో ఆరంభం దక్కలేదు. కేవలం 14 పరుగుల వద్ద కగిసో రబాడ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ ఆడిన షాట్ నేరుగా శుభ్‌మన్ గిల్ చేతుల్లో పడటంతో అతడు పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం 18 పరుగుల వద్ద మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వికెట్లు పడుతున్నా ఐడెన్ మార్క్రమ్ కొంతసేపు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు.

వివరాలు

రాణించిన ప్రసిద్ధ కృష్ణ

అయితే 30 పరుగుల వద్ద ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ఆయుష్ బదోని కూడా నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు చేసి ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో లక్నో 74 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం అబ్దుల్ సమద్, నికోలస్ పూరన్ జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పూరన్ 19 పరుగుల వద్ద ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి శుభ్‌మన్ గిల్ చేతికి చిక్కాడు.

వివరాలు

రెండు వికెట్లతో రాణించిన అశోక్ వర్మ

కొద్దిసేపటికే అబ్దుల్ సమద్ కూడా 18 పరుగుల వద్ద అశోక్ శర్మ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో జార్జ్ లిండే, మహ్మద్ షమీ కొన్ని బౌండరీలతో స్కోర్‌ను ముందుకు నడిపించారు. దీంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు పడగొట్టగా, అశోక్ శర్మ 2 వికెట్లు తీశాడు. కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ సాధించారు.

Advertisement