హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భారత్ వరల్డ్ కప్ మ్యాచుల ఫ్రీ సేల్ టికెట్లు.. నిరాశలో అభిమానులు
టీమిండియా వరల్డ్ కప్ 2023 మ్యాచుల టికెట్ల విక్రయాలు మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమయ్యాయి. మాస్టర్ కార్డ్ వినియోగదారులు గరిష్టంగా రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకొనే వెలుసుబాటును కల్పించారు. వన్డే వరల్డ్ కప్ టికెట్ల కోసం 'మాస్టర్ కార్డ్' కస్టమర్ల కోసం 'బుక్ మై షో' ప్రత్యేకమైన ఫ్రీ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ ప్రారంభించిన 4 గంటల్లోనే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ టికెట్ల కోసం సాయంత్రం 6 గంటల నుంచి ఆన్ లైన్ లో అభిమానులు బుక్ చేసుకొనేందుకు ప్రయత్నించారు. దాదాపు 10 గంటల వరకు అభిమానులు టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు.
'సోల్డ్ అవుట్' అంటూ ప్రకటన
తర్వాత టికెట్లు పూర్తిగా అయిపోయాయంటూ 'సోల్డ్ అవుట్' అనే ప్రకటన కనిపించడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆక్టోబర్ 14న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు కేవలం 1 గంటలోనే అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. భారత్ ఆడే మ్యాచ్ టికెట్లు అన్ని కేవలం నాలుగు గంటల్లోనే అమ్ముడుపోవడం విశేషం. టికెట్లు బుక్ చేసుకోవడంలో విఫలమైన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే మాస్టర్ కార్డ్ వినియోగదారులకు మాత్రమే ఫ్రీ సేల్ అవకాశం కల్పించారు. ఇక భారత్ వార్మప్ మ్యాచుల కోసం ఆగస్టు 30 నుండి వివిధ దశలలో అన్ని మ్యాచుల టిక్కెట్లు లైవ్ స్టార్ట్ అయ్యే అవకాశముంది. సెప్టెంబర్ 15 నుంచి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు అభిమానులు టికెట్లు కొనుగోలు చేయవచ్చు.