Page Loader
మాంచెస్టర్ యునైటెడ్‌పై ఆర్సెనల్ విజయం
మాంచెస్టర్ యూనియన్‌పై ఆధిపత్యం చెలాయించిన ఆర్సెనల్

మాంచెస్టర్ యునైటెడ్‌పై ఆర్సెనల్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2023
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రీమియర్ లీగ్ 2022-23లో ఆదివారం ఎమిరేట్స్‌లో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్‌ను ఆర్సెనల్ అధిగమించింది. మాంచెస్టర్ యునైటెడ్ పై 3-2 తేడాతో ఆర్సెనల్ విజయం సాధించింది. మార్కస్ రాష్‌ఫోర్డ్ యునైటెడ్‌కు ఆధిక్యాన్ని అందించగా.. ఆర్సెనల్ ప్లేయర్ ఎడ్డీ న్కేటియా దాన్ని సమం చేశాడు. రెండవ అర్ధభాగంలో, బుకాయో సాకా అర్సెనల్‌కు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. అయితే లిసాండ్రో మార్టినెజ్ మరో గోల్ చేశాడు. దీంతో ఆర్సెనల్ ఆధిపత్యం చెలాయించింది.

ఆర్సెనల్

నాలుగో స్థానంలో ఆర్సెనల్

ఆర్సెనల్ 19 మ్యాచ్ ల తరువాత 50 పాయింట్లకు దూసుకెళ్లి సత్తా చాటింది. యునైటెడ్ 20 మ్యాచ్ లు ఆడి 39 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో యునైటెడ్ ఐదోవ ఓటమిని చవిచూడడం గమనార్హం. యునైటెడ్ కోసం ప్రీమియర్ లీగ్లో గోల్ చేసిన ఏడవ అర్జెంటీనా ఆటగాడు మార్టినెజ్ రికార్డుకెక్కాడు. FIFA ప్రపంచ కప్ 2022 ముగిసినప్పటి నుండి యునైటెడ్ తరుపున రాష్‌ఫోర్డ్ తొమ్మిది గోల్స్ చేశాడు. రాష్‌ఫోర్డ్ ఈ సీజన్‌లో యునైటెడ్ తరపున 28 మ్యాచ్ లు ఆడి, 17 గోల్స్ సాధించాడు, ఇందులో PLలో తొమ్మిది గోల్స్ ఉన్నాయి. అతను ప్రీమియర్ లీగ్‌లో మొత్తం 68 గోల్స్ సాధించాడు.