LOADING...
AFG vs SA: గ్రూప్-బిలో తొలి సమరానికి సిద్ధం.. సౌతాఫ్రికా-అప్ఘనిస్తాన్ క్రికెట్ యుద్ధం!
గ్రూప్-బిలో తొలి సమరానికి సిద్ధం.. సౌతాఫ్రికా-అప్ఘనిస్తాన్ క్రికెట్ యుద్ధం!

AFG vs SA: గ్రూప్-బిలో తొలి సమరానికి సిద్ధం.. సౌతాఫ్రికా-అప్ఘనిస్తాన్ క్రికెట్ యుద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2025
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 19న మొదలైన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు గ్రూప్-ఏ జట్లు పోటీ పడ్డాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ విజయం సాధించగా, బంగ్లాదేశ్‌ను ఓడించి టీమ్‌ఇండియా రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. ఇక నేటి నుంచి గ్రూప్-బిలోని జట్లు పోటీకి దిగనున్నాయి. కరాచీలో జరిగే మ్యాచ్‌లో అప్ఘనిస్తాన్-సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఒకప్పుడు చిన్న జట్టుగా భావించిన అప్ఘనిస్తాన్, వరుసగా వరల్డ్ ఛాంపియన్లను ఢీకొంటూ గట్టి పోటీ ఇస్తోంది. వన్డే వరల్డ్ కప్-2023, టీ20 వరల్డ్ కప్-2024లో టాప్ జట్లను కూడా షాక్‌కు గురిచేసిన అప్ఘనిస్తాన్, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Details

హెడ్ టు హెడ్ రికార్డు

ఇప్పటివరకు అప్ఘనిస్తాన్-సౌతాఫ్రికా ఐదు వన్డేల్లో తలపడ్డాయి. అందులో సఫారీ జట్టు ఆధిక్యం సాధించింది. కానీ, ఈ జట్ల మధ్య జరిగిన ఏకైక వన్డే సిరీస్‌ను అప్ఘనిస్తాన్ 2-1తో గెలుచుకుంది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో తొలిసారి ఆడిన ఈ రెండు జట్ల పోరులో, సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో గెలిచింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో మళ్లీ అప్ఘన్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. 2024లో యూఏఈ వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అప్ఘనిస్తాన్ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి, చివరి మ్యాచ్‌ను సౌతాఫ్రికా గెలిచింది.

Details

 ఉత్కంఠభరిత పోరు 

అత్యంత ఫామ్‌లో ఉన్న అప్ఘనిస్తాన్ జట్టు, స్పిన్ విభాగంలో బలంగా కనిపిస్తోంది. రషీద్ ఖాన్, గుల్బదీన్ నాయబ్, నూర్ అహ్మద్‌లతో అప్ఘన్ బౌలింగ్ లైనప్ మరింత బలపడింది. సౌతాఫ్రికా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉంది. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత, ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశముంది