Punjab Kings : 'పంజాబ్ కింగ్స్'లో విబేధాలు.. ఆయనపై ప్రీతీ జింటా లీగల్ యాక్షన్
ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌లో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలిసింది. ఆ జట్టు సహ యజమానుల మధ్య విబేధాలు తలెత్తినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. పంజాబ్ కింగ్స్‌లో వాటాదారులుగా బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, పారిశ్రామికవేత్తలు మోహిత్ బర్మన్, నెస్ వాడియా ఉన్నారు. తమ షేర్లను నెస్ వాడియా, ప్రీతీ జింటాకు తెలియకుండా అమ్మేందుకు మోహిత్ బర్మన్ సిద్ధమయ్యారట. దీన్ని అడ్డుకోవాలని ప్రీతీ జింటా చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించినట్లు కథనాలు వెలువడ్డాయి.
షేర్లను అమ్మడం లేదని స్పష్టం చేసిన మోహిత్ బర్మన్
అయితే ఈ వ్యాఖ్యలను మోహిత్ బర్మన్ ఖండించారు. తాను ఎలాంటి షేర్లను అమ్మడం లేదని స్పష్టం చేశారు. ఇక దీనిపై పంజాబ్ కింగ్స్ తరుఫున ప్రతినిధులు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. వాటాలను అమ్మే ముందు బయటికి వారికి కాకుండా, మొదటగా భాగస్వాములకు ఆఫర్ ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఆసక్తి చూపకపోతే బహిరంగంగా విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. అయితే పంజాబ్ కింగ్స్ విషయంలో ఇలా జరగకపోవడంతో ప్రీతీ జింటా చట్టపరమైన చర్యలను దిగినట్లు తెలుస్తోంది.